Congress Loss : సీట్లతో పాటు ఓట్లు కోల్పోయిన కాంగ్రెస్

సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన పార్టీకి దెబ్బ

Congress Loss : దేశంలోని ఐదు రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు ముగిశాయి. ప‌వ‌ర్ లో ఉన్న పంజాబ్ లో సైతం అధికారాన్ని పోగొట్టుకుంది కాంగ్రెస్ పార్టీ(Congress Loss). గ‌ణ‌నీయంగా ఊహించ‌ని రీతిలో సీట్ల‌నే కాదు భారీగా ఓట్ల‌ను కోల్పోయింది.

ఆయా రాష్ట్రాల‌లో వ‌రుస‌గా సీట్ల‌ను కోల్పోవ‌డం ఆ పార్టీకి మింగుడు ప‌డ‌డం లేదు. పంజాబ్ తో పాటు ఉత్త‌రాఖండ్,

ఉత్త‌ర ప్ర‌దేశ్ , మ‌ణిపూర్ , గోవా ల‌లో సైతం త‌న ప్ర‌భావాన్ని చూప‌లేదు. ఉత్త‌రాఖండ్ లో హరీష్ రావ‌త్ ఓడి పోయాడు.

పంజాబ్ లో ద‌ళిత కార్డు వ‌ర్క‌వుట్ కాలేదు. సీఎం చ‌న్నీతో పాటు పీసీసీ చీఫ్ సిద్దూ ఓట‌మి పాల‌య్యాడు.

ఇక యూపీలో అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన ప్రియాంక గాంధీ చ‌రిష్మా ప‌ని చేయ‌లేదు. రాహుల్ మాట‌లు ఓట్ల‌ను రాల్చ‌లేక పోయాయి.

ఓట్ల శాతాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా 15 శాతం ఓట్లు ఆప్ కు ఇత‌ర పార్టీల‌కు వెళ్ల‌డం విశేషం.

ఇక ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ త‌న‌కు అనుకూలంగా 19 శాతం ఓట్ల‌తో ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది.

బీజేపీకి 2 శాతం ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇక్క‌డ ఆప్ సాధించిన 19 శాతం ఓట్లు కాంగ్రెస్ , శిరోమ‌ణి అకాలీద‌ళ్ పార్టీల నుంచి వ‌చ్చాయి. గోవా లో కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా 6 శాతం ఓట్లు పోల్ కావ‌డం గ‌మ‌నార్హం.

అయితే సీట్లు రావ‌డం విశేషం. కొత్త‌గా ఏర్పాటైన రివ‌ల్యూష‌న‌రీ గోవా పార్టీ 10 శాతం ఓట్ల‌ను తీసుకుంది.

ఆప్ , టీఎంసీ, ఎంజీపీ వెనుక‌బ‌డ్డాయి. యూపీలో 4 శాతం ఓట్లు రాగా బీఎస్పీకి 9 శాతం ఓట్లు త‌గ్గాయి.

3 శాతం బీజేపీకి చేరితే 13 శాతం స‌మాజ్ వాది పార్టీకి వ‌చ్చాయి. 5 శాతం ఓట్ల‌ను పొంద‌గ‌లిగింది కాంగ్రెస్ పార్టీ.

కానీ బీజేపీని అధిగ‌మించ లేక పోయింది. మ‌ణిపూర్ లో 19 శాతం ఓటు షేర్ ను కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ.

ఇక‌నైనా కాంగ్రెస్ పార్టీ సీరియ‌స్ గా ఆలోచించాలి. లేక పోతే దాని మ‌నుగ‌డే క‌ష్టంగా మారే ప్ర‌మాదం పొంచి ఉంద‌న్న మాజీ ప్ర‌ధాని దేవె గౌడ మాట‌ల‌ను ఒక‌సారి ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి.

Also Read : రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎంపిక‌పై ఉత్కంఠ

Leave A Reply

Your Email Id will not be published!