Congress : రైళ్లలో ఆహార లోపాలపై విమర్శలు చేసిన కాంగ్రెస్ కు క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ
రైల్వే శాఖపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై IRCTC సోషల్ మీడియా ద్వారా స్పందించింది...
Congress : దేశ వ్యాప్తంగా రైళ్లలో నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారని కాంగ్రెస్.. ఎన్డీఏ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. గడిచిన రెండేళ్లలో రైళ్లలో నాసిరకం ఆహార పదార్థాలు 500 శాతం పెరిగినట్లు RTI నివేదిక ఇచ్చింది. దీనిని ఎక్స్‌లో పోస్ట్ చేసిన కాంగ్రెస్(Congress).. రైల్వే శాఖ తీరుపై మండిపడింది. ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ రైల్వేలను నాశనం చేసిందని ఎక్స్‌లోని పోస్ట్‌లో ఆరోపించింది. రైళ్లల్లో ప్రయాణం, ఆహారం రెండూ సురక్షితం కాదని విమర్శించింది. ” రెండేళ్లలో రైళ్లలో నాసిరకం ఆహారంపై ఫిర్యాదులు 500 శాతం పెరిగాయి. నాసిరక ఆహార వీడియోలు ప్రతిరోజూ వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్నిసార్లు కీటకాలు, బొద్దింకలు కనిపిస్తున్నాయి. రైల్వే శాఖ పనితీరుకు ఇది నిదర్శనం. ఎన్డీయే సర్కార్ రైల్వేలను ఆధునికీకరిస్తామని చెబుతోంది. సౌకర్యాలు కల్పిస్తామని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలుసు. ప్రధానికి ప్రజలపై ప్రేమ లేదు. ఆయన ధనవంతులైన తన స్నేహితుల కోసమే ఆలోచిస్తూ ఉంటారు” అని కాంగ్రెస్ X పోస్ట్‌లో చేసింది.
Congress…
రైల్వే శాఖపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై IRCTC సోషల్ మీడియా ద్వారా స్పందించింది. ” కరోనా మహమ్మారి సమయంలో రైళ్లలో ఇలాంటి ఘటనలు జరిగాయి” అని ఐఆర్సీటీసీ అధికారిక ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది. దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు మార్గాల్లో నడిచే ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది. ఆగస్టు 19న తిరుపతి-కాచిగూడ, కాకినాడ టౌన్ – సికింద్రాబాద్- కాకినాడ టౌన్, నర్సాపూర్ – సికింద్రాబాద్- నర్సాపూర్ రైళ్లు అందుబాటులో ఉండవని రైల్వే శాఖ వెల్లడించింది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
Also Read : CM Chandrababu : తెలుగింటి ఆడబిడ్డలకు ‘రాఖీ’ శుభాకాంక్షలు