Congress : రాహుల్ ను అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరిన కాంగ్రెస్ సీనియర్ నేత

కేంద్ర బడ్జెట్‌పై చర్చలో భాగంగా సోమవారం లోక్‌సభలో రాహుల్‌ ప్రసంగిస్తూ...

Congress : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ టార్గెట్ చేసిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్న వేళ.. కాంగ్రెస్(Congress) సీనియర్ నేత ఒకరు బీజేపీకి సవాల్ విసిరారు. ఆ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ(Abhishek Singhvi) ఆదివారం ఢిల్లీలో మాట్లాడుతూ.. రాహుల్‌ని ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆయన్ని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. అరెస్ట్ చేస్తే బీజేపీ శవపేటికకు అరెస్టే చివరి మేకు అవుతుందని హెచ్చరించారు. పార్లమెంటులో చక్రవ్యూహ ప్రసంగం తరువాత దర్యాప్తు సంస్థలు రాహుల్‌పై నిఘా పెట్టాయని ఆయన ఆరోపించారు.

Congress Senior leader Comment

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనపై దాడులు చేసేందుకు సిద్ధమవుతోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. లోక్‌సభలో ‘చక్రవ్యూహం’ అంటూ తాను చేసిన ప్రసంగం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు నచ్చలేదన్నారు. ఆ ప్రసంగం నేపథ్యంలో త్వరలోనే తనపై ఈడీ దాడులకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ‘ ఆ ఇద్దరిలో’ ఒకరికి తన చక్రవ్యూహం ప్రసంగం నచ్చలేదని తెలుస్తోందని, అందువల్లే తనపై దాడులకు సిద్ధమవుతున్నట్లు ఈడీలో పనిచేస్తున్న కొంతమంది తెలిపారని రాహుల్‌ పేర్కొన్నారు. ‘ ఈ దాడుల కోసం ఎదురుచూస్తున్నా. చాయ్‌, బిస్కట్లు సిద్ధంగా ఉంచండి’ అని ఈడీ డైరెక్టరేట్‌ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ రాహుల్‌ గాంధీ శుక్రవారం తన ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు.

కేంద్ర బడ్జెట్‌పై చర్చలో భాగంగా సోమవారం లోక్‌సభలో రాహుల్‌ ప్రసంగిస్తూ.. ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని ‘పద్మవ్యూహం’లోకి నెట్టివేస్తున్నారని ధ్వజమెత్తారు. మహాభారతంలోని కీలక ఘట్టమైన పద్మవ్యూహాన్ని, వీరమరణం పొందిన అభిమన్యుడిని ప్రస్తావిస్తూ.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా తదితరులపై విమర్శలు గుప్పించారు. అయితే, తనపై ఈడీ దాడులు జరగొచ్చన్న రాహుల్‌ గాంధీ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. వయనాడ్‌ ఎంపీగా అక్కడ జరిగిన విషాద ఘటనకు బాధ్యత వహించాల్సి వస్తుందనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తింది.

జులై 29వ తేదీన కేంద్ర బడ్జెట్‌‌పై రాహుల్ గాంధీ సుధీర్ఘ ప్రసంగం చేశారు. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడిని ఆరుగురు వ్యక్తులు చక్రవ్యూహంలో బంధించి చంపారని, తాను కొంచెం పరిశోధన చేసి చక్రవ్యూహాన్ని కనిపెట్టినట్లు రాహుల్ చెప్పారు. చక్రవ్యూహాన్ని పద్మవ్యూహం అని కూడా అంటారు. ‘ 21వ శతాబ్దంలో ఒక కొత్త చక్రవ్యూహం ఏర్పడింది. అభిమన్యుడిలా దేశంలోని యువకులు, రైతులు, మహిళలు, చిన్న, మధ్యతరహా వ్యాపారులు ప్రస్తుతం ఆరుగురు వ్యక్తుల కారణంగా నలిగిపోతున్నారు. చక్రవ్యూహంలో ఆరుగురు వ్యక్తులు మోదీ, షా, మోహన్ భగవత్, అజిత్ ధోవల్, ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ’ అని రాహుల్ పేర్కొన్నారు.

Also Read : Minister Ponguleti : విద్య వైద్యం కు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది

Leave A Reply

Your Email Id will not be published!