Congress Jai Shankar : భారత్ పరువు తీసిన జై శంకర్
ఎల్ఏసీ కామెంట్స్ పై కాంగ్రెస్ ఎదురు దాడి
Congress Jai Shankar : భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ ను ఏకి పారేసింది కాంగ్రెస్ పార్టీ(Congress Jai Shankar). జాతీయ మీడియా ఏఎన్ఐ ఎడిటర్ స్మితా ప్రకాశ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రధానంగా ఆయన మోదీని పొడిగారు. అదే సమయంలో తన తండ్రిని దివంగత ప్రధాని ఇందిరా గాంధీ ఎలా తొలగించారో కూడా చెప్పారు.
ఆపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ గురించి చులకన చేస్తూ మాట్లాడారు. చైనా సరిహద్దు వద్దకు భారత ఆర్మీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపించారని కానీ రాహుల్ గాంధీ కాదన్నారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు బుధవారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించింది. రాహుల్ గాంధీని వ్యక్తిగతంగా దూషించడం ఆయన సంస్కారానికి నిదర్శనమని పేర్కొంది. అంతే కాదు జై శంకర్ చేసిన వ్యాఖ్యలు భారత దేశ విదేశాంగ విధానాన్ని, సైన్యం పరాక్రమాన్ని కూడా దెబ్బ తీశాయని మండిపడింది.
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి(Jai Shankar) తన స్థాయికి దిగజారి మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనాలో ఎక్కువ కాలం రాయబారిగా ఉన్నారు. మరి ఇంత కాలం ఏం చేశారంటూ ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ. సుదీర్ఘ కాలం పాటు అక్కడ ఉన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థతో భారత్ పోటీ పడలేదని ఎలా చెప్పగలరని ప్రశ్నించారు.
చైనా దూకుడుకు సంబంధించిన ఆ ఫోటోలు ఏమిటి. ఇప్పుడు మన పెట్రోలింగ్ పాయింట్లు బఫర్ జోన్ గా మారాయని దీనిపై ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించింది. ఈ విషయంలో ప్రధాని మోదీకి ఎందుకు చెప్పలేక పోయారని పేర్కొంది.
Also Read : బీజేపీ గెలుపు కోసం టీఎంసీ ప్రయత్నం