Corona Danger Comment : క‌రోనా క‌లక‌లం ‘మ‌స్తు’ వ్యాపారం

స్వీయ నియంత్ర‌ణే మార్గం

Corona Danger Comment : క‌రోనా వేగంగా విస్త‌రిస్తోంది. ఇది కేంద్ర ప్ర‌భుత్వం ప‌దే ప‌దే చెబుతూ వ‌స్తున్న మాట‌. బ‌త‌క‌డ‌మే గ‌గ‌న‌మై పోయిన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో శ్వాస పీల్చు కోవ‌డం కూడా నేరంగా మారింది. అదో భ‌యాన్ని క‌లుగ(Corona Danger)  చేస్తోంది. ప‌క్క‌నే ఉన్న చైనాను భ‌యపెడుతోంది. దాంతో మ‌న‌మూ అప్ర‌మ‌త్తం కావాల‌ని అంటోంది స‌ర్కార్.

గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా క‌రోనా భూతం ఒక మ‌హ‌మ్మారిగా వ్యాపించింది. ప్ర‌పంచాన్ని వ‌ణించింది. ఇంకా కాటు వేస్తూనే ఉంది. క్యాన్స‌ర్ కు , స‌క‌ల రోగాల‌కు మందులు కనుగొన్న శాస్త్ర‌వేత్త‌లు, వైద్యులు చివ‌ర‌కు క‌రోనా వ‌ర‌కు వ‌చ్చే స‌రికి చేతులు ఎత్తేశారు. మ‌రోసారి వ్యాక్సిన్లు వేసుకోవాల‌ని ప్ర‌చారం చేస్తోంది ప్ర‌భుత్వం. క‌రోనాను నియంత్రించేందుకు మార్గాలు లేవా. ఉన్నా వాటిని త‌ట్టుకునే ఓపిక‌, శ‌క్తి శ‌రీరాల‌కు ఉందా అంటే అనుమాన‌మే.

ఎందుకంటే ప్ర‌తిదీ క‌ల్తీ. దానిని వ్యాపింప చేస్తున్న‌ది కూడా వ్యాపార‌మే. ఇవాళ రోగం అన్న‌ది మ‌నుషుల‌కు ప్రాణాంత‌కంగా మారితే ఫార్మా, వైద్య రంగానికి, ప్ర‌త్యేకించి ఆస్ప‌త్రులు, య‌జ‌మానులు, మందుల త‌యారీదారులు, కంపెనీలు, బ‌డా వ్యాపార‌వేత్త‌ల‌కు క‌ల్ప‌త‌రువుగా మారింది. ఇది అక్ష‌రాల వాస్త‌వం. ఈరోజు వ‌ర‌కు కేంద్రంలో కొలువుతీరిన మోదీ ప్ర‌భుత్వం ఎంత మంది క‌రోనా కార‌ణంగా చ‌ని పోయార‌నే వాస్త‌వాల‌ను చెప్ప‌లేక పోయింది.

క‌రోనా కార‌ణంగా ఎంద‌రో ప్రాణాలు(Corona Danger)  కోల్పోయారు. అది ప‌క్క‌న పెడితే వారిని న‌మ్ముకున్న కుటుంబాలు ఇవాళ రోడ్డు పాల‌య్యాయి. వారికి క‌నీసం ప‌రిహారం ఇవ్వ‌లేక పోయింది స‌ర్కార్. ఇది త‌మ బాధ్య‌త కాదంటోంది.

ఇక రాష్ట్రాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. క‌రోనా భూతం రాజ‌కీయాల‌కు వ‌స్తువుగా మారింది. ఇది ప‌క్క‌న పెడితే అవ‌స‌ర‌మైన‌న్ని స‌దుపాయాలు కాల్పించాల‌ని పాల‌కులు చేతులెత్తేశారు.

ఎంతో మంది ఆక్సిజ‌న్ అంద‌క మ‌ధ్య‌లోనే ప్రాణాలు పోయిన ఉదాహ‌ర‌ణ‌లు కోకొల్ల‌లు. క‌రోనా రాకుండా ఉండేందుకు వైద్యుల‌కు కేవ‌లం డోలో 360 రాయ‌మ‌ని రెఫ‌ర్ చేసినందుకు కోట్లాది రూపాయ‌లు లంచ‌గా ఇచ్చార‌ని ఫార్మా కంపెనీపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఏది ఏమైనా క‌రోనా వ‌స్తుందా రాదా అన్న‌ది ప‌క్క‌న పెడితే ఎవ‌రికి వారు త‌మ త‌మ ప‌రిధుల్లో జాగ్ర‌త్త‌లు పాటించ‌డం అవ‌స‌రం. ఎందుకంటే ప్రాణాంత‌కంగా మారే కంటే ముందు మేలుకోవ‌డం ముఖ్యం.

ఈ దేశంలో విద్య‌, వైద్యం పూర్తిగా ఫ‌క్తు వ్యాపారంగా , కాసుల‌మ‌యంగా మారింది. ఇక‌నైనా ప్ర‌జ‌లు మేలుకోవాలి. పాల‌కుల‌ను ప్ర‌శ్నించాలి. త‌మ‌కు మెరుగైన ఆరోగ్య‌, వ‌స‌తి క‌ల్పించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాల‌ద‌ని గుర్తు చేయాలి. కార్పొరేట్ శ‌క్తుల‌కు, వారు న‌డిపే సంస్థ‌ల‌కు ఊడిగం చేయ‌డాన్ని నిల‌దీయాలి..అవ‌స‌ర‌మైతే ప్ర‌శ్నించాలి.

లేక పోతే కుక్క చావుకు లోన‌య్యేది మ‌న‌మేన‌ని గుర్తు పెట్టుకోవాలి. క‌రోనా ప్రాణాంతక వ్యాధి కాద‌న‌లేం కానీ అంత‌కంటే వ్యాపార సామ్రాజ్యం అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది..అది క‌రోనా కంటే డేంజ‌ర్ అని తెలుసుకోవాలి.

Also Read : స‌ర్టిఫికెట్ ఉంటేనే స్వామి దర్శ‌నం

Leave A Reply

Your Email Id will not be published!