Mohammed Zubair : మ‌హమ్మ‌ద్ జుబైర్ బెయిల్ పై కోర్టు విచార‌ణ

ఆయ‌న‌కు చంపుతామంటూ బెదిరింపులు

Mohammed Zubair : మ‌త ప‌ర‌మైన మ‌నో భావాల‌ను దెబ్బ తీసార‌నే ఆరోప‌ణ‌లపై సీతాపూర్ లో త‌న‌పై న‌మోదైన కేసును కొట్టి వేయాల‌ని బెయిల్ ను కోరుతూ ఆల్ట్ న్యూస్ కో ఫౌండ‌ర్ మ‌హ్మ‌ద్ జుబేర్(Mohammed Zubair) సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

అంతే కాకుండా కొంద‌రు త‌న‌ను టార్గెట్ చేశార‌ని, త్వ‌ర‌లోనే చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయ‌ని జుబైర్ త‌ర‌పు న్యాయ‌వాది కోర్టుకు విన్న‌వించారు.

దీనిని అత్య‌వ‌స‌ర పిటిష‌న్ కింద మాన‌వ‌తా దృక్ఫ‌థంతో ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌ల‌ని కోరారు. ఇదిలా ఉండ‌గా దాఖ‌లు చేసిన దావాపై శుక్ర‌వారం సుప్రీంకోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

జుబైర్ త‌ర‌పున న్యాయ‌వాది కోలిన్ గోన్సాల్వేస్ వాదిస్తున్నారు. ప్ర‌జ‌లు అత‌డిని చంపుతామ‌ని ప్ర‌క‌టిస్తున్నారు. ఆయ‌న‌కు ప్రాణ‌గండం పొంచి ఉంద‌ని, అందుకే బెయిల్ ఇవ్వాల‌ని కోరారు.

అత‌డి భ‌ద్ర‌త‌పై కూడా ఆందోళ‌నగా ఉంద‌ని పేర్కొన్నారు. గురువారం జుబైర్ దాఖ‌లు చేసిన పిటీష‌న్ ను విచారించాల‌ని కోర్టును కోరారు. భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి క్లియ‌రెన్స్ కు లోబ‌డి ఈ అంశాన్ని రేపు విచార‌ణ‌కు వ‌చ్చేలా చూడాల‌ని జ‌స్టిస్ ఇందిరాదేవి ఆదేశించారు.

కాగా 2018లో ఆల్ట్ న్యూస్ కో ఫౌండ‌ర్ జుబైర్ చేసిన ట్వీట్ పై జూన్ 27న మొద‌టిసారిగా ఢిల్లీ పోలీసులు కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేశారు. ప్ర‌స్తుతం జుబైర్ తీహార్ జైలులో ఉన్నారు. అక్క‌డి నుంచి యూపీలోని సీతాపూర్ కు తీసుకు వెళ్లారు. అక్క‌డ కూడా మ‌రో కేసు న‌మోదైంది.

Also Read : ‘పయోలీ ఎక్స్ ప్రెస్’ వెరీ వెరీ స్పెష‌ల్

Leave A Reply

Your Email Id will not be published!