Covid-19 Updates : ప్రపంచవ్యాప్తంగా మళ్లీ మొదలైన కరోనా విజృంభణ.. మహారాష్ట్రలో 43 కొత్త కేసులు

ఇప్పటివరకు నమోదైన 300 కేసుల్లో 248 ముంబై నుంచే నమోదయ్యాయి...

Covid-19 : ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు మరోసారి ప్రబలుతున్న వేళ, తాజాగా ఇండియాలోని మహారాష్ట్రలో కూడా ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో రాష్ట్రంలో 43 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 209కి చేరింది. ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం పూణేలో అత్యధికంగా 35 కేసులు నమోదు కాగా, ముంబైలో 8 కొత్త కేసులు రికార్డయ్యాయి. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, జనవరి నుంచి మహారాష్ట్రలో మొత్తం 300 కోవిడ్(Covid-19) కేసులు నమోదయ్యాయి. వీటిలో జనవరిలో 1 కేసు, ఫిబ్రవరిలో 1, మార్చిలో 0, ఏప్రిల్‌లో 4 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మే నెలలో 242 కేసులు నమోదయ్యాయి. అంటే, మొత్తం ఇన్ఫెక్షన్ కేసులలో 80 శాతం మే నెలలోనే నమోదయ్యాయి.

Covid-19 Case in Maharashtra

ఇప్పటివరకు నమోదైన 300 కేసుల్లో 248 ముంబై నుంచే నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో ఇవి 82.67%. దీన్ని బట్టి చూస్తే ముంబై మరోసారి కరోనా కేంద్రంగా మారుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కారణంగా నాలుగు మరణాలు మాత్రమే నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్త మరణం సంభవించలేదు. ఈ క్రమంలో చికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్న 87 మంది రోగులు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. కోవిడ్ సంక్రమణను నివారించడానికి ఆరోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది. దీంతోపాటు ప్రజలు కూడా మాస్క్ ధరించి జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది.

కరోనా వ్యాప్తిస్తే ఈ జాగ్రత్తలు పాటించాలి :

  • రద్దీగా ఉండే ప్రదేశాలలో ఎల్లప్పుడూ మాస్క్‌ను ధరించడం, ముఖ్యంగా మీకు అనారోగ్యంగా అనిపిస్తే
  • తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవడం లేదా శానిటైజర్ వాడటం కొనసాగించండి
  • మీకు జ్వరం లేదా జలుబు, ఒంటి నొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే పరీక్షలు చేయించుకుని కోవిడ్ గురించి నిర్ధారించుకోండి
  • వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి

Also Read : Donald Trump : రష్యా అధ్యక్షుడు పుతిన్ పై భగ్గుమన్న ట్రంప్

Leave A Reply

Your Email Id will not be published!