CP CV Anand Warning : ఆ అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠాను కచ్చితంగా పట్టుకుంటాం..

ఇండియాలోనే తలదాచుకున్నారని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు...

CP CV Anand : ఇటీవల రెండు ఘరానా దొంగల ముఠాలను పట్టుకోవడంలో ఆలస్యం అయ్యిందని, కాని కచ్చితంగా పట్టుకుంటామని సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ పారిశ్రామిక వేత్త ఇంట్లో భారీ చోరీకి పాల్పడి సుమారు రూ. 5 కోట్లతో ఉడాయించిన నేపాల్‌ దొంగల ముఠాను, అఫ్జల్‌గంజ్‌లో కాల్పులకు పాల్పడిన ఘరానా అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠాను కచ్చితంగా పట్టుకొని తీరుతామన్నారు. అక్కడ వారి చిరునామాల్లో గాలించగా వారు ఇండియా దాటి నేపాల్‌కు వెళ్లలేదని తేలిందని తెలిపారు.

CP CV Anand Strong Warning

ఇండియాలోనే తలదాచుకున్నారని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండియా నేపాల్‌ బార్డర్‌లో లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశామని తెలిపారు. దొంగల ఆచూకీ తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈస్టుజోన్‌ డీసీపీ : 8712660501, అడిషనల్‌ డీసీపీ : 8712660503, ఏసీపీ : 8712660506/09, కాచిగూడ ఎస్‌హెచ్‌వో: 8712660540, డీఐ: 8712660541. నంబర్‌లకు తెలియజేయాల్సిందిగా పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కాల్పులకు తెగబడిన దోపిడీ దొంగలను పట్టుకోవడంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమన్నారు.

Also Read : PM Modi-Bihar Tour : బీహార్ లో 50 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని

Leave A Reply

Your Email Id will not be published!