CPI Narayana : విమాన సంస్థల పై భగ్గుమన్న సిపిఐ నారాయణ

భారత్ దేశ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్లైట్ టికెట్ ధరలు నిర్ణయించాలని సూచించారు...

CPI Narayana : విమాన టికెట్ల ధరలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) ఫైర్ అయ్యారు. టికెట్ ధరలకు సంబంధించి కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు నారాయణ లేఖ రాశారు. విమాన ప్రయాణికులను విమాన సంస్థలు దోచుకుంటున్నాయని మండిపడ్డారు. మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కలిపిస్తే ప్రైవేట్ విమానయాన సంస్థలు అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచుతున్నాయని వ్యాఖ్యలు చేశారు. ప్రయాణ దూరం మారనప్పుడు టికెట్ ధరలు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. ప్రజలను లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

CPI Narayana Slams..

భారత్ దేశ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్లైట్ టికెట్ ధరలు నిర్ణయించాలని సూచించారు. విమానయాన టికెట్ల రేట్లపై నియంత్రణ ఉండాలన్నారు. విమానయాన శాఖ ప్రజల కోసం పని చేయాలన్నారు. విమానయాన టికెట్ల ధరలు ప్రజలకు అనుకూలంగా ఉండాలని వెల్లడించారు. కార్పొరేట్ వ్యక్తులే కాదు సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని తెలిపారు. విమానయాన సంస్థలకు బాంబు బెదరింపులు వస్తుంటే ఇంటలిజెన్స్ విభాగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. సైకలాజికల్ టెర్రర్‌కు గురి చేస్తున్నారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉగ్ర మూకలు రెచ్చిపోతున్నాయన్నారు. విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఇంటెలిజెన్స్ వైఫల్యమంటూ విరుచుకుపడ్డారు. విమానయాన సంస్థలు టికెట్లు ధరలను నియంత్రించకపోతే అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అవుతుందన్నారు. ప్రపంచంలో హంగర్ ఇండియా 112 వ స్థానంలో ఉందన్నారు. ట్రైన్‌లో కూడా వందే భారత్ పేరిట టికెట్ల రేట్లు పెంచారని నారాయణ పేర్కొన్నారు.

Also Read : Babu Mohan : టీడీపీ గూటికి చేరిన నటుడు మాజీ మంత్రి బాబు మోహన్

Leave A Reply

Your Email Id will not be published!