CPI Ramakrishna : జగన్..అదానీ భేటీ వెనుక కథేంటి
నిప్పులు చెరిగిన సీపీఐ రామకృష్ణ
CPI Ramakrishna : విజయవాడ – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. జగన్ , అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీతో ఎందుకు భేటీ అయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు.
CPI Ramakrishna Slams YS Jagan
ఇద్దరి మధ్య జరిగిన భేటీ వివరాలను రాష్ట్ర ప్రజలకు తెలియ చేయాలని అన్నారు రామకృష్ణ(CPI Ramakrishna). అది వ్యక్తిగతమైన భేటీనా లేక వ్యవస్థీకృత భేటీనా అన్నది తేలాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో కూడా ఆహ్వాన పత్రిక ఇచ్చే పేరుతో అదానీ , జగన్ మోహన్ రెడ్డితో 4 గంటల పాటు భేటీ అయ్యారని అన్నారు రామకృష్ణ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే గంగవరం, కృష్ణ పట్నం పోర్టులను , సోలార్ విద్యుత్ ఒప్పందాలను అదానీ కంపెనీకి ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. దీని వెనుక ఎన్ని కోట్లు చేతులు మారాయో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు రామకృష్ణ.
ఏపీలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వెనుక భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఎందుకు అంత ధరకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సారి జగన్ ఓడి పోవడం ఖాయమన్నారు.
Also Read : Giri Pradakshina : ఇంద్రకీలాద్రిలో ఘనంగా పౌర్ణమి