KL Rahul : క్రికెట్ కి నెల రోజుల పాటు బ్రేక్ తీసుకున్న క్రికెటర్ కేఎల్ రాహుల్
క్రికెట్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోవాలని కేఎల్ రాహుల్ డిసైడ్ అయ్యాడు...
KL Rahul : టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వరుస సిరీస్‌లతో బిజీ అయిపోయాడు. వెంటవెంటనే బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌ల్లో ఆడి అలసిపోయాడు. మిగతా సీనియర్లతో పోలిస్తే అతడు ఫర్వాలేదనిపించాడు. ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రథమార్థంలో సూపర్బ్ నాక్స్‌తో ఆకట్టుకున్నాడు. పెర్త్ టెస్ట్ విక్టరీతో పాటు రెండో మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఆ తర్వాత గాడి తప్పాడు. మంచి స్టార్ట్స్ దొరికినా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యాడు. అతడి ఫెయిల్యూర్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో విమర్శల పాలవుతున్నాడు రాహుల్(KL Rahul). ఈ తరుణంలో అతడు కీలక నిర్ణయం తీసుకున్నాడు.
KL Rahul Taken..
క్రికెట్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోవాలని కేఎల్ రాహుల్(KL Rahul) డిసైడ్ అయ్యాడు. వచ్చే కొన్ని వారాల పాటు ఆటకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాడు. టీమిండియా మ్యాచులు లేని సమయంలో ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని భారత క్రికెట్ బోర్డు కొత్త రూల్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆసీస్ సిరీస్ ముగిశాక ఆటగాళ్లంతా తమ స్టేట్ టీమ్స్‌కు వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ నడుస్తుండటంతో అందులో ఆడుతున్నారు. రాహుల్ సొంత జట్టు కర్ణాటక ఈ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. దీంతో అతడు ఆడటం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ కేఎల్ ట్విస్ట్ ఇచ్చాడు.
బిజీషెడ్యూల్‌తో అలసిపోవడంతో విజయ్ హజారే ట్రోఫీతో పాటు రంజీ ట్రోఫీకి కూడా కేఎల్ రాహుల్ దూరం కానున్నాడని తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మాత్రం ఆడనున్నాడట. ఇంగ్లీష్ టీమ్‌తో టీ20లతో పాటు వన్డేలు కూడా ఆడనుంది టీమిండియా. అయితే రాహుల్‌ను పొట్టి ఫార్మాట్ కోసం బీసీసీఐ పరిగణించడం లేదు. కాబట్టి వన్డే సిరీస్‌కు అతడ్ని ఎంపిక చేయొచ్చు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు మంచి ప్రాక్టీస్ కావాలి కాబట్టి ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రాహుల్ ఆడటం ఖాయం. ఫిబ్రవరి 6వ తేదీన ఆ టీమ్‌తో తొలి వన్డేలో తలపడనుంది భారత్. అంటే రాబోయే నెల రోజుల పాటు రాహుల్ ఆటకు దూరంగా ఉండనున్నాడు. ఒకవేళ రంజీల్లో ఆడాల్సిందిగా బీసీసీఐ ఆదేశిస్తే మాత్రం అతడు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.
Also Read : YS Sharmila : సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ లపై ఏపీసీసీ చీఫ్ విమర్శలు