CSK Coach : రాయుడుది టీ కప్పులో తుపాను
సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్
CSK Coach : అంబటి రాయుడు ట్వీట్ వ్యవహారం చర్చకు దారి తీసింది మరోసారి. ప్రతిసారి తప్పుకుంటానని చెప్పడం. ఆ తర్వాత తాను చేసిన ప్రకటనను తిరిగి విరమించు కోవడం పరిపాటిగా మారింది.
తెలుగు కథలో ఓ పేరొందిన కథ ఉంది. అదే ఆవు పులి కథ. అలాగే జరిగింది రాయుడు చేసిన ట్వీట్. ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 తనకు ఆఖరి లీగ్ అని ట్వీట్ చేశాడు.
ఆపై ఏమైందో ఏమో కాని ఉన్నట్టుండి ఆ ట్వీట్ ను తీసేశాడు. దీనిపై వెంటనే స్పందించాడు చెన్నై సూపర్ కింగ్స్ సిఇఓ కాశీ విశ్వనాథన్(CSK Coach). అంబటి రాయుడు ఎక్కడికీ వెళ్లడని తమతో ఉంటాడని స్పష్టం చేశాడు.
ఇటీవల పూర్ పర్ ఫార్మెన్స్ బాగా లేక పోవడంతో నిరాశకు గురై ఉంటాడని, అంతకు తప్ప మరొకటి కాదన్నాడు. ఇదిలా ఉండగా లీగ్ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయుడిని ఆడించ లేదు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.
మై లాస్ట్ ఐపీఎల్ అంటూ పేర్కొన్నడంపై సీఎస్కే హెడ్ కోచ్(CSK Coach) స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. రాయుడు ట్వీట్ వ్యవహారాన్ని తేలిగ్గా తీసి పారేశాడు. దీనిని టీ కప్పులో తుపాను అని పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఫ్లెమింగ్ రాయుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి అతడు బాగానే ఆడుతున్నాడని తాను భావిస్తున్నట్లు తెలిపాడు.
జట్టు శిబిరంలో పాలు పంచుకున్నాడు. ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యాడు. కొంత నిరాశ ఉండి ఉండవచ్చు. కానీ బాగా ఆడగలడు అని కితాబు ఇచ్చాడు.
Also Read : ఎవరీ జూనియర్ మలింగ ఏమిటా కథ