CSK vs DC IPL 2022 : చెల రేగిన చెన్నై త‌ల‌వంచిన ఢిల్లీ

91 ప‌రుగుల తేడాతో ఘోర ప‌రాజ‌యం

CSK vs DC IPL 2022 :ధోనీ మ‌రోసారి ప‌గ్గాలు చేప‌ట్టాక చెన్నై సూప‌ర్ కింగ్స్ స‌త్తా చాటింది. దుమ్ము రేపింది. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది.

ఐపీఎల్ లో జ‌రిగిన లీగ్ మ్యాచ్ పూర్తిగా ఏక‌ప‌క్షంగా సాగింది. ఊహించ‌ని రీతిలో ఢిల్లీ ఏ కోశాన చెన్నైని ఢీకొట్ట‌లేక పోయింది(CSK vs DC IPL 2022). దీంతో ఏకంగా 91 ప‌రుగుల తేడాతో చెన్నై విజ‌య బావుటా ఎగుర వేసింది.

ఇక ప్లే ఆఫ్స్ రేసులో ఇప్ప‌టికే రెండు జ‌ట్లు ఖ‌రారు అయ్యాయి. కానీ మిగ‌తా రెండు జ‌ట్లు ఏవి ఉంటాయ‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ముందుగా చెన్నై సూప‌ర్ కింగ్స్ బ్యాటింగ్ చేసింది.

నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో భారీ స్కోర్ న‌మోదు చేసింది. 209 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢీల్లీ క్యాపిట‌ల్స్ 117 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. ఢిల్లీ(CSK vs DC IPL 2022) ఇన్నింగ్స్ లో మిచెల్ మార్ష్ ఒక్క‌డే రాణించాడు.

25 చేసిన ప‌రుగులే ఆ జ‌ట్టులో టాప్ స్కోర్. చెన్నై బౌల‌ర్ల‌లో ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సింది మొయిన్ అలీ గురించి. 4 ఓవ‌ర్లు వేసి 3 వికెట్లు తీశాడు. సిమ్ర‌న్ జిత్ , ముకేశ్ చౌద‌రి, బ్రావో చెరో 2 వికెట్లు తీశారు(CSK vs DC IPL 2022).

మొత్తంగా ఢిల్లీ ప‌త‌నంలో పాలు పంచుకున్నారు. ఇక చెన్నై బ్యాటింగ్ లో మార‌థాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 49 బంతులు ఎదుర్కొని
7 ఫోర్లు 5 సిక్స‌ర్ల‌తో 87 ర‌న్స్ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 33 బాల్స్ ఎదుర్కొని 41 ర‌న్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు ఒక సిక్స‌ర్ ఉంది.

చివ‌ర‌లో వ‌చ్చిన శివ‌మ్ దూబే 19 బంతులు ఎదుర్కొని 32 ర‌న్స్ చేస్తే మ‌హేంద్ర సింగ్ ధోనీ 8 బంతులు ఆడి 2 సిక్స్ ల‌తో 21 ర‌న్స్ చేసి నాటౌట్ గా మిగిలాడు.

 

Also Read : తిప్పేసిన హ‌స‌రంగ ఆర్సీబీ విక్ట‌రీ

Leave A Reply

Your Email Id will not be published!