ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. జార్ఖండ్ డైనమెంట్ ఎంఎస్ ధోనీతో పాఉ రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలానికి స్పీడ్ స్టర్ మతీషా పతిరణ తోడవడంతో 27 పరుగుల తేడాతో గెలుపొందింది.
డేవిడ్ వార్నర్ సేన బౌలర్లు చెన్నైని అద్భుతమైన బౌలింగ్ తో కట్టడి చేసినా చివరకు బ్యాటర్లు చేతులెత్తేయడంతో పరాజయం తప్పలేదు. ముందుగా బ్యాటింగ్ చేసింది చెన్నై సూపర్ కింగ్న్. నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆశించిన మేర ధీటుగా జవాబు ఇవ్వలేక చతికిల పడింది.
అంతకు ముందు ధోనీ మరోసారి తన పవర్ ఏమిటో రుచి చూపించాడు. చివరలో వచ్చిన కెప్టెన్ ఖలీల్ అహ్మద్ కు చుక్కలు చూపించాడు. ఇక ఢిల్లీ విషయానికి వస్తే కెప్టెన్ డేవిడ్ వార్నర్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఫిల్ సాల్ట్ 17 రన్స్ చేస్తే మిచ్ మార్ష్ 5 పరుగులే చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 రన్స్ కే ఢిల్లీ పరిమితమైంది. ఈ గెలుపుతో చెన్నై సూపర్ కింగ్స్ 15 పాయింట్లతో ప్లే ఆఫ్ రేసులోకి దూసుకు వెళ్లింది.
