CWG 2022 India : వ‌జ్రోత్స‌వాల వేళ ‘ప‌త‌కాలు’ క‌ళ క‌ళ‌

కామ‌న్వెల్త్ గేమ్స్ లో భార‌త దేశం భ‌ళా

CWG 2022 India : యావ‌త్ భార‌తం మురిసి పోయింది. స‌మున్న‌త భారాతావ‌ని సంతోషంతో ఉప్పొంగి పోయింది. భ‌ర‌త మాత త‌న బిడ్డ‌లు

సాధించిన విజ‌యాల‌ను చూసి ఉబ్బి త‌బ్బిబ్బ‌యింది.

133 కోట్ల భార‌తీయులంతా జేజేలు ప‌లికారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఈసారి బ్రిట‌న్ లోని బ‌ర్మింగ్ హోమ్ వేదిక‌గా జ‌రిగిన 22వ

కామ‌న్వెల్త్ గేమ్స్ -2022లో(CWG 2022 India) స‌త్తా చాటారు.

ఏకంగా 61 ప‌త‌కాల‌తో ఓవ‌రాల్ గా ప‌త‌కాల ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో నిలిచేలా చేశారు. మీరా బాయి చానుతో ప్రారంభ‌మైన ప‌త‌కాల ప్ర‌స్థానం చివ‌రి దాకా కొన‌సాగింది.

కేంద్రంలో న‌రేంద్ర మోదీ(PM Modi) ప్ర‌భుత్వం కొలువు తీరిన త‌ర్వాత క్రీడా రంగానికి ఎన‌లేని ప్ర‌యారిటీ ఇస్తూ వ‌చ్చారు. ఎవ‌రు ఏ రంగంలో ఉన్న వారైనా స‌రే వారిని గుర్తించి, వారి గురించి ప్ర‌స్తావించ‌డం, వారు ఎలా విజేత‌లుగా నిలిచారో చెప్ప‌డం హైలెట్ గా నిలుస్తూ వ‌చ్చింది.

అంతే కాదు ప్ర‌తి నెలా ఆఖ‌రి వారంలో నిర్వ‌హించే మ‌న్ కీ బాత్ రేడియో కార్య‌క్ర‌మంలో అష్ట క‌ష్టాలు ప‌డి గెలుపు సాధించిన వారి విజ‌య గాథ‌ల‌ను తెలియ చెప్ప‌డం విశేషం.

క్రీడాకారుల‌ను అభినందించ‌డ‌మే కాదు వారిని వెన్ను త‌ట్టి ప్రోత్స‌హించ‌డాన్ని మెచ్చుకోకుండా ఉండ‌లేం. రాజ‌కీయాలు ప‌క్క‌న పెడితే క్రీడాకారులు, అథ్లెట్లు అద్బుత‌మైన ప్ర‌తిభా పాట‌వాల‌ను ప్ర‌ద‌ర్శించారు.

ప్ర‌తి విభాగంలో త‌మ‌దైన ముద్ర‌ను క‌న‌బ‌రిచారు. లాన్ బౌల్స్ లో చ‌రిత్ర సృష్టించారు. బంగారు ప‌త‌కాన్ని కైవసం చేసుకున్నారు. మొద‌టి

సారిగా ప్ర‌వేశ పెట్టిన మ‌హిళా క్రికెట్ ఈవెంట్ లో భార‌త మ‌హిళ‌లు కొద్ది పాటి తేడాతో స్వ‌ర్ణాన్ని కోల్పోయారు.

ర‌జ‌తంతో స‌రి పెట్టుకున్నారు. 12 విభిన్న క్రీడ‌ల‌లో భార‌తీయ అథ్లెట్లు ప‌త‌కాలు సాధించి భార‌త దేశానికి గ‌ర్వ కార‌ణంగా నిలిచారు. మొత్తం

ప‌త‌కాల‌లో 22 స్వ‌ర్ణాలు, 16 ర‌జ‌తాలు, 23 కాంస్య ప‌త‌కాల‌తో చ‌రిత్ర సృష్టించారు.

తెలుగు తేజం స్టార్ షెట్ల‌ర్ పీవీ సింధు మొద‌టిసారిగా బంగారంతో మెరిసింది. ఇక తెలంగాణ బిడ్డ నిఖ‌త్ జ‌రీన్ బాక్సింగ్ లో స‌త్తా చాటింది.

ప‌సిడిని ముద్దాడింది. ల‌క్ష్య సేన్ , సాయి రాజ్ , చిరాగ్ శెట్టి , శ‌ర‌త్ క‌మ‌ల్ లు బంగారు ప‌త‌కాల‌తో మెరిశారు.

హాకీలో స్వ‌ర్ణం చేజారింది ర‌జ‌తం ద‌క్కింది. వెయిట్ లిఫ్ట‌ర్లు సంకేత్ స‌ర్గ‌ర్, గురురాజా పూజారి, బింద్యా రాణి, మీరా బాయి ప‌త‌కాల పంట పండించారు. రెజ్లింగ్ , బ్యాడ్మింట‌న్ , టేబుల్ టెన్నిస్ ల‌లో భార‌త్ టాప్ లో ఉంది.

లాన్ బౌన్స్ లో పురుషుల జ‌ట్టు రజ‌తాన్ని సాధించింది. ఎల్టోస్ పాల్ , అబ్దుల్లా అబూ బాక‌ర్ పురుషుల ట్రిపుల్ జంప్ లో స‌త్తా చాటారు. ఆచంట

శ‌ర‌త్ క‌మ‌ల్ క‌మాల్ చేశాడు.

స్వ‌ర్ణం ద‌క్కేలా చేశాడు. వినేష్ ఫోగ‌ట్ హ్యాట్రిక్ గోల్డ్ మెడ‌ల్స్ తో చ‌రిత్ర సృష్టించారు. ఏది ఏమైనా ప్ర‌పంచ క్రీడా రంగంలో భార‌త దేశ

మువ్వొన్నెల ప‌తాకం రెప రెప లాడేలా చేశారు.

క్రీడాకారులు సాధించిన విజ‌యాలు కోట్లాది మంది భార‌తీయ యువ‌తీ యువ‌కుల‌కు స్పూర్తి దాయ‌కంగా నిలుస్తాయ‌న‌డంలో సందేహం లేదు.

Also Read : ఇక‌నైనా ర‌న్ మెషీన్ రాణిస్తాడా

Leave A Reply

Your Email Id will not be published!