CWG 2022 Priyanka : రేస్ వాక్ లో ప్రియాంకకు రజతం
పతకాల వేటలో భారత దేశం దూకుడు
CWG 2022 Priyanka : బ్రిటన్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. పతకాల వేటలో దూసుకు పోతున్నారు.
నిన్నటి దాకా 26 పతకాలతో ఐదో స్థానంలో ఉన్న భారత్ ఇవాళ కూడా తన దూకుడు ప్రదర్శిస్తోంది. శనివారం జరిగిన 10 కిలోమీటర్ల రేస్ వాక్ లో భారత దేశానికి చెందిన ప్రియాంక రజత పతకాన్ని (CWG 2022 Priyanka) సాధించింది.
మరో వైపు బాక్సర్లు అమిత్ పంఘల్, నీతూ రజత పతకాలను పొందేందుకు తమ సంబంధిత విభాగాలలో ఫైనల్స్ కు ప్రవేశించారు. 10,000 మీటర్ల రేస్ వాక్ లో ప్రియాంక ఫైనల్ కు చేరింది.
తృటిలో బంగారు పతకాన్ని కోల్పోయింది. రజతంతో సరి పెట్టుకుంది. ఇక పురుషుల ఫ్లై వెయిట్ లో భారత బాక్సర్లు పంఘల్ ..నీతూ ఫైనల్ కు చేరుకోవడంతో మరో రెండు పతకాలు భారత్ ఖాతాలో చేరడం ఖాయమని తేలి పోయింది.
గెలిస్తే స్వర్ణాలు దక్కుతాయి. లేదంటే రజత పతకాలు సాధించడం పక్కా. ఇక తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిఖత్ జరీన్ తో సహా మరో నలుగురు భారతీయులు కూడా సెమీ ఫైనల్ కు అర్హత సాధించారు.
ఇందులో గెలిస్తే రజతాలు లేదంటే కాంస్య పతకాలు ఖాయంగా కనిపిస్తోంది. 8వ రోజున రెజ్లర్లు మూడు బంగారు పతకాలతో సత్తా చాటారు. 9వ రోజున భారత బృందం మరిన్ని పతకాలను ఆశిస్తోంది.
రెజ్లింగ్ లో వినేష్ ఫోగట్ , రవికుమార్ లు యాక్షన్ లో పాల్గొంటారు. సెమీస్ లో ఇంగ్లండ్ తో తలపడనున్న భారత మహిళా క్రికెట్ జట్టు కూడా ఫోకస్ పెట్టింది.
ఈ పోటీలో గెలిస్తే రజత పతకం ఖాయం. భారత పురుషుల హాకీ జట్టు సెమీస్ లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
Also Read : కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు 26 పతకాలు