D Raja CPI : కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర సర్కార్ పాలన

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.మూడు లక్షల కోట్లు ఇచ్చిందని చెబుతున్నారని...

D Raja : కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా కార్పొరేట్లకు అనుకూలంగా పాలన సాగిస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. బుధవారం సీపీఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో ‘ఆధునిక భారత నిర్మాణంలో సీపీఐ పాత్ర-భవిష్యత్తు సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లౌకిక రాజ్యాంగ స్ఫూర్తిని హరిస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని రాజా(D Raja) దుయ్యబట్టారు. స్వాతంత్య్ర పోరాటంలో ఎలాంటి పాత్ర పోషించకుండా బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులకు తొత్తులుగా వ్యవహరించిన ఆర్‌ఎ్‌సఎస్‌ రాజకీయ విభాగమైన బీజేపీ నేడు అధికారంలో ఉండడం దురదృష్టమన్నారు.

D Raja CPI Slams…

స్వాతంత్య్రం అనంతరం దేశ సమైక్యత, భాషాప్రయుక్త రాష్ట్రాలు, ఫెడరల్‌ వ్యవస్థ కోసం సీపీఐ కృషి చేసిందన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగిన తర్వాత దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ పేర్కొనడాన్ని ఆయన ఖండించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ గత ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చి ఉంటే కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేసేదన్నారు. దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ దేశాన్ని తిరోగమనం వైపు తీసుకువెళుతోందని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.మూడు లక్షల కోట్లు ఇచ్చిందని చెబుతున్నారని, అలాంటప్పుడు ఆ నిధులతో సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అదానీతో జరిగిన విద్యుత్‌ ఒప్పందాన్ని రద్దు చేయకపోతే కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని రామకృష్ణ హెచ్చరించారు.

Also Read : AP New DGP : ఏపీకి కొత్త పోలీస్ బాస్ గా రానున్న ‘హరీష్ కుమార్ గుప్తా’

Leave A Reply

Your Email Id will not be published!