D Subba Rao : కొలువుల క‌ల్ప‌న‌లో కేంద్రం ఫెయిల్

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గ‌వ‌ర్న‌ర్

D Subba Rao : కొలువుల క‌ల్ప‌న‌లో కేంద్రంలో కొలువు తీరిన కేంద్ర స‌ర్కార్ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ డి. సుబ్బారావు(D Subba Rao). ఉపాధి క‌ల్ప‌న‌లో కేంద్ర బ‌డ్జెట్ విఫ‌ల‌మైంద‌న్నారు. నిరుద్యోగ నిర్మూల‌న‌కు స‌రైన చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో అంతగా ఫోక‌స్ పెట్ట‌లేద‌న్నారు. దేశంలో నెల‌కు 10 ల‌క్ష‌లు ఉద్యోగాలు అవ‌స‌రం అవుతాయ‌ని కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆ స్థాయిలో భ‌ర్తీ చేసిన దాఖ‌లాలు లేవ‌న్నారు.

జీడీపీలో 83 శాతానికి పైగా అప్పులు ఉన్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేంద్ర బ‌డ్జెట్ 2023 -24 నిరుద్యోగ నిర్మూల‌న‌కు స‌రైన చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో విఫ‌ల‌మైంద‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మాజీ ఆర్బీఐ గ‌వ‌ర్నర్. కేంద్రం ఉపాధి క‌ల్పించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో ఆల‌స్యం చేయ‌డం వ‌ల్లే దేశంలో నిరుద్యోగ స‌మ‌స్య తీవ్ర‌త‌ర‌మ‌వుతుంద‌ని పేర్కొన్నారు.

ఉత్ప‌త్తి కార‌క ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేయ‌క పోవ‌డం వ‌ల్ల‌నే నిరుద్యోగ స‌మ‌స్య నెల‌కొంద‌న్నారు డి. సుబ్బారావు(D Subba Rao). దేశ వ్యాప్తంగా ప్ర‌తి నెలా 10 ల‌క్ష‌ల మంది కొత్త వాళ్లు రోడ్ల‌పైకి వ‌స్తున్నార‌ని కానీ క‌నీసం 2 ల‌క్ష‌ల మ‌దికి కూడా జాబ్స్ క‌ల్పించే స్థితిలో ప్ర‌స్తుతం కేంద్రం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ . నిరుద్యోగ నిర్మూల‌న‌కు కేంద్రం చేస్తున్న ఆలోచ‌న‌కు వాస్త‌వ ప‌రిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు .

ఎఫ్ఆర్బీఎం సూచించిన 60 శాతం కంంటే చాలా ఎక్కువ అప్పులు ఉన్నాయ‌ని తెలిపారు. దీని వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై వ‌డ్డీల భారం ఎక్కువ‌గా ఉంద‌న్నారు ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ డి. సుబ్బా రావు. ఇందులో భాగంగా జీడీపీలో అప్పుల శాతం ఎంత ఉంద‌నేది కూడా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : లైఫ్ సైన్స్ రంగంలో హైద‌రాబాద్ టాప్

Leave A Reply

Your Email Id will not be published!