Dale Steyn : ఆడుతున్న వాళ్లనే ఎంపిక చేయండి
మాజీ పేసర్ డేల్ స్టెయిన్ కామెంట్
Dale Steyn : మాజీ పేసర్ డేల్ స్టెయిన్ సంచలన కామెంట్స్ చేశారు. భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్ ఆట తీరు దారుణమన్నాడు.
ఇదే సమయంలో అద్భుతంగా ఫినిషింగ్ టచ్ ఇస్తూ భారీ పరుగులు చేస్తూ వస్తున్న దినేష్ కార్తీక్ ను ఆకాశానికి ఎత్తేశాడు. ఆస్ట్రేలియాలో త్వరలో జరగనున్న టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టులో కార్తీక్ ఉండడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు.
అవుట్ సైడ్ బంతుల్ని ఆడుతూ వికెట్ ను పారేసు కోవడం పంత్ కు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశాడు. ఇంత జరిగినా ఎందుకు నేర్చుకోవడం లేదో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నాడు డేల్ స్టెయిన్(Dale Steyn).
ఎంత గొప్ప స్థానంలో ఉన్న ప్లేయర్ ఉన్నా తప్పులు చేశారని, వాటిని గుర్తించి మళ్లీ పుంజుకున్నారని కానీ ఈ విషయంలో రిషబ్ పంత్ నేర్చుకోక పోవడాన్ని తప్పు పట్టారు.
ఇదే సమయంలో దినేష్ కార్తీక్ తిరిగి జట్టులోకి రావడం అద్భుతమని పేర్కొన్నాడు. ప్రస్తుతం పంత్ ఆట తీరు దారుణంగా ఉందంటూ మాజీ ఆటగాళ్లతో పాటు అభిమానులు ఫైర్ అవుతున్నారు.
రిషబ్ కు నాలుగు సార్లు ఆడేందుకు చాన్స్ వచ్చింది. కానీ వికెట్లకు దూరంగా వెళ్లే బంతుల్ని ఆడి పెవిలియన్ దారి పట్టడం చర్చకు దారి తీస్తోంది.
ఇలాగే గనుక ఆడితే టి20 వరల్డ్ కప్ లో ఇషాన్ కిషన్ , సంజూ శాంసన్ , దినేష్ కార్తీక్ పోటీ పడుతున్నారు. ఈ సమయంలో ఎవరు బాగా ఆడితే వారినే ఎంపిక చేయాలని డేలే స్టెయిన్ సూచించాడు బీసీసీఐకి.
Also Read : టీ20 వరల్డ్ కప్ జట్టుపై గంగూలీ కామెంట్స్