CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో నిరసనలు తెలిపిన దళిత సంఘాలు

దళిత సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు...

CM Revanth Reddy : నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిరసన తెలిపేందుకు దళిత సంఘాల నాయకులు పెద్దఎత్తున సిద్ధమయ్యారు. వరంగల్ అదాలత్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు.

CM Revanth Reddy….

దళిత సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దళిత బంద్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా దళిత సంఘాల నాయకులు రోడ్డెక్కారు.

Also Read : Minister Kishan Reddy : టీటీడీ బోర్డు నిర్ణయాలపై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!