Danish Kaneria : కోహ్లీ ఇదీ ఒక ఇన్నింగ్సేనా – కనేరియా
రన్ మెషీన్ పై షాకింగ్ కామెంట్స్
Danish Kaneria : పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా(Danish Kaneria) షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత , పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఆసియా కప్ మ్యాచ్ లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
చివరి బంతి వరకు ఉత్కంఠ రేపింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన భారత్ 148 పరుగులు చేసింది 5 వికెట్లు కోల్పోయింది.
మొదట్లోనే కేఎల్ రాహుల్ వికెట్ ను కోల్పోయి ఇబ్బంది పడింది. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇచ్చిన క్యాచ్ మిస్ అయ్యింది. ఒకవేళ పట్టి ఉంటే కోహ్లీ మరోసారి విమర్శలకు గురయ్యేవాడు.
గత కొంత కాలం నుంచీ కోహ్లీ చేసిన పరుగులు చాలా తక్కువ. ఇంగ్లండ్ టూర్ లో 20 పరుగలకు మించి చేయలేక పోయాడు. అసలు జట్టులో ఉంటాడో ఉండడోనన్న పరిస్థితి.
ఒకప్పుడు టన్నుల కొద్దీ పరుగులు చేసిన కోహ్లీ ఇవాళ ఫోర్లు, సిక్సర్లు కొట్టేందుకు నానా తంటాలు పడుతున్నాడు. ఇక పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 34 బంతులు ఎదుర్కొని 35 రన్స్ చేశాడు.
ఈ మ్యాచ్ లో 3 వికెట్లు పడగొట్టి 33 రన్స్ చేసిన హార్దిక్ పాండ్యా(Hardik Pandya) హీరోగా మారాడు. కాగా పాకిస్తాన్ స్పిన్నర్ కనేరియా మాత్రం ఏక పారేశాడు కోహ్లీని. ఇదీ ఒక ఇన్నింగ్సేనా అంటూ ఎద్దేవా చేశాడు.
తన స్వంత యూట్యూబ్ ఛానల్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండో బంతికే పెవిలియన్ బాట పట్టాల్సి ఉంది. కానీ ఫకర్ జమాన్ వదిలి వేయడంతో బతికి బయట పడ్డాడని పేర్కొన్నాడు.
Also Read : మేం గెలుస్తామని ముందే తెలుసు