Dasun Shanaka Thanks : విరిసిన నవ్వులు కురిసిన కన్నీళ్ళు
లంక సాధించిన విజయం అపురూపం
Dasun Shanaka Thanks : ఒకే ఒక్క విజయం ఆ దేశాన్ని ఇప్పుడు ఊపేస్తోంది. ఆ విజయం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లక్షలాది మంది ఇప్పుడు గెలుపును ఆనందిస్తున్నారు. నవ్వుల జల్లులు కురిపిస్తున్నారు.
తట్టుకోలేక ఆ అపురూప విజయాన్ని మళ్లీ మళ్లీ నెమరు వేసుకుంటున్నారు. ఆనందం తట్టుకోలేక భాష్పాలు (కన్నీళ్లు ) కారుస్తున్నారు. ఇంతలా ఉద్విగ్నతను పెంచి, ఉత్కంఠను రేపి విజయాన్ని సాధించిన సన్నివేశానికి వేదికైంది శ్రీలంక.
అవును ఈ గెలుపు కోట్లాది మందిని కదిలించింది. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అన్న సినీ కవి సిరివెన్నెల రాసిన పాట గుర్తుకు వచ్చేలా చేసింది ఈ విజయం. పదాలలో వర్ణించ లేం. మాటల్లో చెప్పలేం.
ఈ సక్సెస్ కు కారణమైంది మాత్రం ఒకే ఒక్కడు. అతడే శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక(Dasun Shanaka Thanks) ఎవరూ ఊహించ లేని, ఎవరూ సాధించ లేని అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.
ఈ మేరకు తన దేశానికి అపురూపమైన విజయాన్ని సాధించి పెట్టాడు. నిన్నటి దాకా ఆయిల్ , గ్యాస్, ఆహారం, నిత్యావసర సరుకుల కోసం
అల్లాడిన ప్రజలంతా ఇప్పుడు ఈ సక్సెస్ తో మరిచి పోయారు.
క్రికెట్ లో ఇంత మజా ఉంటుందా అన్నంతగా ఈ మ్యాచ్ జరిగింది. పల్లెకెలె మైదానం చరిత్రకు సాక్షీభూతంగా నిలిచింది. శ్రీలంక క్రికెట్ చరిత్రలో
ఇది సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గదని పేర్కొన్నాడు శ్రీలంక మాజీ కెప్టెన్,
రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర. ఒకే ఒక్క మ్యాచ్ తో దసన్ షనక వరల్డ్ వైడ్ గా హీరోగా మారి పోయాడు. చిన్నారుల దగ్గరి నుంచి
పెద్ద వాళ్ల దాకా పెద్ద ఎత్తున మ్యాచ్ విజయాన్ని ఆస్వాదించారు.
శ్రీలంక జాతీయ పతాకాలు మళ్లీ రెప రెప లాడాయి. ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో గెలుపు సాధించింది శ్రీలంక.
మొదట బ్యాటింగ్ చేసిన ఆసిస్ 177 పరుగులు చేసింది.
అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అప్పటికి 17 ఓవర్లు పూర్తయ్యాయి. ఇక మైదానంలో ఉన్న కెప్టెన్ షనక
ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
3 ఓవర్లు 18 బంతుల్లో 59 పరుగులు కావాల్సి వచ్చింది. 24 బంతులు ఆడి 58 రన్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. శ్రీలంకకు అపురూపమైన..అద్భుతమైన గెలుపు అందించాడు.
ఇదిలా ఉండగా దీనికి సంబంధించిన వీడియోను లంక కెప్టెన్(Dasun Shanaka Thanks) స్వయంగా ట్విట్టర్ లో షేర్ చేశాడు. మా ప్రజల్లో
మళ్లీ నవ్వు చూసినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఈ సందర్భంగా తలంచి నమస్కరించాడు..దేశానికి..ప్రజలకు.
Also Read : అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు
I’m very happy to see these smiling faces of my people 😇🇱🇰 pic.twitter.com/H4yQDmLpjj
— Dasun Shanaka (@dasunshanaka1) June 11, 2022