David Lloyd : ఐపీఎల్ వల్ల సంపన్నులకు లాభం
డేవిడ్ లాయిడ్ సంచలన కామెంట్స్
David Lloyd : ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడా పోటీలలో టాప్ లో నిలిచింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ). 2008లో ఆనాటి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న లలిత్ మోదీ దీనికి శ్రీకారం చుట్టాడు.
ఆ తర్వాత అది కోట్లాది రూపాయలు కొల్లగొట్టేలా మారింది. ఇప్పటి వరకు 14 సీజన్లు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్నది 15వ సీజన్. ప్రపంచ వ్యాప్తంగా టాప్ కంపెనీలన్నీ ఐపీఎల్ పై ఫోకస్ పెట్టాయి.
ఇక అమెరికా లాంటి దేశంలో కూడా ఐపీఎల్ తరహా క్రికెట్ పోటీలకు వేదిక కానుంది. ఇందు కోసం మైక్రోసాఫ్ట్ సైతం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రూ. 900 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఏది ఏమైనా తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెట్ దిగ్గజం డేవిడ్ లాయిడ్(David Lloyd) ఐపీఎల్ పై స్పందించాడు. సంచలన కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ ఇవాళ అత్యంత ఆదాయాన్ని ఇచ్చే కల్పతరువుగా మారిందన్నాడు.
ఒక రకంగా చెప్పాలంటే ఇది ఓ అక్షయపాత్ర లాగా మారిందన్నాడు. ఈ ఐపీఎల్ సంపన్నులకు ప్రయోజనం చేకూరుస్తోందని అన్నాడు డేవిడ్ లాయిడ్(David Lloyd). ఒక రకంగా క్రికెట్ లో ఈ తరహా క్రీడా పోటీ ఓ కుదుపు కుదిపేసిందన్నాడు.
కొన్ని ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న సంప్రదాయేదర క్రికెట్ రాను రాను ఆదరణ ఉండడం లేదన్నాడు లాయిడ్. ఇదిలా ఉండగా ఐపీఎల్ ను ప్రపంచంలోనే అత్యుత్తమ దేశీవాళీ టీ20 టోర్నీగా పలువురు అభివర్ణించారు.
జాతీయ జట్టుకు కోచ్ గా వ్యవహరించిన లాయిడ్ ఐపీఎల్ ఒక ప్రైవేట్ ఎంటర్ ప్రైజెస్ గా మారిందన్నాడు.
Also Read : తండ్రి దాడితో శిఖర్ ధావన్ పరేషాన్