David Miller : వారెవ్వా డేవిడ్ మిల్ల‌ర్ కిల్ల‌ర్

47 బంతుల్లో సెన్సేష‌న్ సెంచ‌రీ

David Miller :  సౌతాఫ్రికా స్టార్ హిట్ట‌ర్ డేవిడ్ మిల్ల‌ర్(David Miller)  మ‌రోసారి రెచ్చి పోయాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. భార‌త బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఒక ర‌కంగా బెంబేలెత్తించాడు. ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. భార‌త్ లో ప‌ర్య‌టిస్తున్న సౌతాఫ్రికా టీమిండియాతో 2వ టి20 మ్యాచ్ లో చివ‌రి దాకా స‌ఫారీలు పోరాడారు.

16 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాల‌య్యారు. మ్యాచ్ ఓడి పోయినా క్రికెట్ అభిమానుల మ‌న‌సు దోచుకున్నాడు కిల్ల‌ర్ మిల్ల‌ర్. కేవ‌లం 47 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న డేవిడ్ మిల్ల‌ర్ షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు. మైదానం న‌లు వైపులా ఆటాడుకున్నాడు.

12 ఓవ‌ర్ లో 19 ర‌న్స్ పిండుకున్నాడు. ఏ బౌల‌ర్ ను విడిచి పెట్ట‌లేదు కిల్ల‌ర్ మిల్ల‌ర్. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా భార‌త్ ను బ్యాటింగ్ చేయ‌మ‌ని కోరాడు. భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో భారీ స్కోర్ చేసింది. 3 వికెట్లు కోల్పోయి 237 ర‌న్స్ చేసింది.

రోహిత్ శ‌ర్మ 37 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్స్ తో 43 ర‌న్స్ చేశాడు. కేఎల్ రాహుల్ 28 బంతులు ఆడి 5 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో 57 ర‌న్స్ చేశాడు. 10 ఓవ‌ర్ల‌లో ఓపెనింగ్ వికెట్ కు 96 ర‌న్స్ జోడించాడు. కేశ‌వ్ మ‌హ‌రాజ్ ఇద్ద‌రు ప్లేయ‌ర్ల‌ను పెవిలియ‌న్ పంపించాడు. అనంత‌రం బరిలోకి దిగిన సూర్య కుమార్ యాద‌వ్ , విరాట్ కోహ్లీ(Virat Kohli) స‌ఫారీల‌ను ఆటాడుకున్నారు.

22 బంతులు ఆడిన సూర్య 61 ర‌న్స్ చేశాడు. కోహ్లీ 49 ర‌న్స్ తో నాటౌట్ గా నిలిచాడు. డేవిడ్ మిల్ల‌ర్ 47 బంతుల్లో 7 సిక్స్ లు 8 ఫోర్ల‌తో 106 ర‌న్స్ చేశాడు.

Also Read : సైబ‌ర్ క‌మాండ్ ఏర్పాటుకు శ్రీ‌కారం

Leave A Reply

Your Email Id will not be published!