Warner Ruled Out : వార్నర్ కు గాయం టెస్ట్ లకు దూరం
ధ్రువీకరించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు
Warner Ruled Out : భారత్ లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టుకు కోలుకోలేని దెబ్బ. ఇప్పటికే నాలుగు టెస్టుల సీరీస్ లో 2 టెస్టులలో ఓటమి పాలైంది. నాగ్ పూర్ , ఢిల్లీ టెస్టులలో భారత బౌలర్లు, బ్యాటర్ల ధాటికి ఆసిస్ విల విల లాడుతోంది. పాట్ కమిన్స్ సారథ్యంలోని ఆసిస్ గతంలో ఎన్నడూ లేనంతగా ఒత్తిడికి లోనవుతోంది. మరో వైపు భారత పిచ్ లపై అసాధారణమైన అనుభవం కలిగిన ఆటగాడిగా గుర్తింపు పొందిన డేవిడ్ వార్నర్(Warner Ruled Out) తీవ్రంగా గాయపడ్డాడు.
ఇది ఆ జట్టుకు మరింత షాక్ కు గురి చేసింది. భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో మూడు సార్లు ఇబ్బంది పడ్డాడు. తక్కువ స్కోర్ కే పరిమితం అయ్యాడు. ఇదే సమయంలో బంతి మోచేతికి బలంగా తాకడంతో విల విలలాడాడు.
అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సాధ్యమైనంత మేర రెస్ట్ తీసుకోవడమే ఉత్తమమని వైద్యులు సూచించారు. దీంతో మిగతా రెండు టెస్టులకు డేవిడ్ వార్నర్(Warner Ruled Out) భయ్యా ఆడడం కష్టమని తేలి పోయింది. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా ధ్రువీకరించింది.
ఇక భారత్ పర్యటనలో భాగంగా ఆసిస్ నాలుగు టెస్టులు , మూడు వన్డే మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ప్రపంచ క్రికెట్ లో మోస్ట్ డేంజరస్ ప్లేయర్ గా గుర్తింపు పొందాడు వార్నర్. ఇప్పటికే భారత్ తో దగ్గరి అనుబంధం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో చాలా కాలం నుంచి ఆడుతూ వస్తున్నాడు. ఇటీవలే ఫామ్ నుంచి తేరుకున్న వార్నర్ ఉన్నట్టుండి గాయపడడం ఆ జట్టుకు మైనస్ పాయింట్ గా మారింది. త్వరలోనే వార్నర్ కోలుకోలేని ఆశిద్దాం.
Also Read : స్వదేశంలో భారత్ ను ఓడించడం కష్టం