David Warner : వారెవ్వా వార్న‌ర్ మామా

రాణించినా గెల‌వ‌ని ఢిల్లీ

David Warner : స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ మేనేజ్ మెంట్ డేవిడ్ వార్న‌ర్(David Warner) ను చూసి సిగ్గు ప‌డాలి. ఎందుకంటే ఈ వ‌ర‌ల్డ్ స్టార్ ప్లేయ‌ర్ ను కాద‌నుకుంది. అంతే కాదు ఇబ్బందులు పెట్టింది. ఆపై అవ‌మానించింది.

ఆ త‌ర్వాత జ‌ట్టు నుంచి త‌ప్పుకునేలా చేసింది. కానీ దెబ్బ తిన్న పులిలా మ‌ళ్లీ విజృంబించాడు. తన‌ను నానా ర‌కాలుగా మాన‌సికంగా చితికి పోయేలా చేసిన జ‌ట్టును ప‌ల్లెత్తు అన‌లేదు.

అంతేనా దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో స‌త్తా చాటాడు. ఏకంగా ఆస్ట్రేలియా జ‌ట్టులో కీల‌క పాత్ర పోషించాడు. మొద‌టిసారిగా ఆ జ‌ట్టుకు క‌ప్ అందించ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడు.

ఆ త‌ర్వాత స్వ‌దేశంలో జ‌రిగిన ఇంగ్లండ్ సీరీస్ లో స‌త్తా చాటాడు. ఆపై పాకిస్తాన్ లో దుమ్ము రేపాడు. మ‌ళ్లీ ఐపీఎల్ లో ఆడేందుకు వ‌చ్చాడు. అత‌డిని ఎవ‌రూ తీసుకునేందుకు సాహించ లేదు.

కానీ బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన మెగా ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ సాహ‌సించి తీసుకుంది. త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని వమ్ము చేయ‌కుండా ఆడుతున్నాడు.

ఆ జ‌ట్టులో ఇప్పుడు కీల‌కంగా మారాడు. తాజాగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్ లో ఏకంగా దంచి కొట్టాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.

కేవ‌లం 38 బంతులు ఎదుర్కొన్న డేవిడ్ వార్న‌ర్(David Warner) 66 ర‌న్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు , 5 భారీ సిక్స్ లు ఉన్నాయి. ఇక స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు టైటిల్ తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త వార్న‌ర్ దే.

Also Read : రైతుల పిల్ల‌ల కోసం హ‌ర్భ‌జ‌న్ వేత‌నం విరాళం

Leave A Reply

Your Email Id will not be published!