Deepika Padukone Emotional : ప‌ఠాన్ విజ‌యం దీపికా భావోద్వేగం

వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ స‌క్సెస్ తో షాక్

Deepika Padukone Emotional : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ , ల‌వ్లీ గ‌ర్ల్ దీపికా ప‌దుకొనే క‌లిసి న‌టించిన ప‌ఠాన్ దుమ్ము రేపుతోంది. విడుద‌లైన అన్ని చోట్లా బాక్సులు బ‌ద్ద‌లు కొడుతోంది. ఊహించ‌ని రీతిలో క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుతూ దూసుకు పోతోంది.

ఇప్ప‌టికే ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 540 కోట్ల‌కు పైగా కొల్ల గొట్టింద‌ని ప్ర‌ముఖ సినీ విమ‌ర్శ‌కుడు త‌ర‌ణ్ ఆద‌ర్ష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా సినిమా రిలీజ్ నుంచి మొద‌లుకొని విడుద‌లయ్యాక కూడా పెద్ద ఎత్తున వివాదాలు చుట్టు ముట్టాయి.

దేశ వ్యాప్తంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ , దాని అనుబంధ సంస్థ‌లు మండిప‌డ్డాయి. కొన్ని చోట్ల టాకీస్ లలో సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌ను నిలిపి వేశారు. చివ‌ర‌కు అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ కోట్లు కొల్ల‌గొడుతోంది పఠాన్ మూవీ.

ఇదిలా ఉండ‌గా చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌డంతో స‌క్సెస్ మీట్ నిర్వ‌హించారు. ఇందులో న‌టీ న‌టులు షారుక్ ఖాన్ , దీపికా ప‌దుకొనే , జాన్ అబ్ర‌హం పాల్గొన్నారు. మాట్లాడుతుండ‌గానే దీపికా ప‌దుకొనే క‌న్నీటి ప‌ర్యంతం(Deepika Padukone Emotional)  అయ్యారు.

తాను క‌ల‌లో కూడా ఊహించ లేద‌ని పేర్కొన్నారు. ఇంత‌టి ఘ‌న విజ‌యాన్ని అందించిన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు తెలిపారు దీపికా ప‌దుకొనే. సినిమా స‌క్సెస్ త‌మ‌కు ఓ పండుగ లాగా అనిపిస్తోంద‌ని చెప్పారు.

సినిమా రిలీజ్ రోజే వెళ్లాల‌ని అనుకున్నా కానీ వెళ్ల‌లేక పోయాన‌ని చెప్పింది దీపికా ప‌దుకొనే. సిద్దార్త్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Also Read : ప‌ఠాన్ గా మారిన డేవిడ్ వార్న‌ర్

Leave A Reply

Your Email Id will not be published!