Delhi Airport: ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కూలిన టెర్మినల్‌ పైకప్పు ! ఆరుగురికి గాయాలు !

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కూలిన టెర్మినల్‌ పైకప్పు ! ఆరుగురికి గాయాలు !

Delhi Airport: దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో టెర్మినల్‌-1 పైకప్పులో కొంత భాగం శుక్రవారం తెల్లవారుజామున కుప్పకూలింది. ట్యాక్సీలు సహా పలు కార్లపై పడటంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆయన్ని రక్షించారు. ఈ ఘటనలో చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. పైకప్పు కూలినట్లు తమకు ఉదయం 5:30 గంటల సమయంలో సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు. దీనితో టెర్మినల్‌-1 నుంచి బయలుదేరే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.

Delhi Airport….

ఢిల్లీ విమానాశ్రయంలో పైకప్పు కూలిన సంఘటనను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు(Minister Ram Mohan Naidu) తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. టెర్మినల్‌-1 వద్ద ప్రయాణికులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని చేయాలని విమానయాన సంస్థలకు సూచించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని తెలిపారు.

ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో వరుసగా రెండోరోజూ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు భీకర ఎండలతో అల్లాడిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. కానీ, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దీనితో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు పూర్తిగా నీటిలో మునిగిపోయిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

Also Read : MLA Yadaiah : వరుస వలసలతో కాళీ అవుతున్న తెలంగాణ కారు పార్టీ

Leave A Reply

Your Email Id will not be published!