Bhagat Singh Sainik School : జయహో భగత్ సింగ్ సైనిక్ స్కూల్
ప్రకటించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్
Bhagat Singh Sainik School : మాటలు కాదు చేతలు ముఖ్యం. దానిని ఆచరణలో చేసి చూపిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , (Delhi CM) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal). గత ఏడాది ఆయన భగత్ సింగ్ పేరుతో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.
ఇవాళ మార్చి 23న సర్దార్ షహీద్ భగత్ సింగ్ వర్దంతి కావడంతో ఈ స్కూల్ ను ప్రారంభిస్తున్నట్లు డిక్లేర్ చేశారు.
ఢిల్లీలోని సైనిక్ స్కూల్ ను ఇక నుంచి భగత్ సింగ్ సైనిక్ స్కూల్(Bhagat Singh Sainik School) గా మారుస్తున్నట్లు ప్రకటించారు సీఎం.
దీనికి భగత్ సింగ్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ స్కూల్ గా మార్చినట్లు తెలిపారు. ఈ స్కూల్ లో 200 సీట్లు ఉంటాయి.
ఢిల్లీ సర్కార్ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా విద్యాభివృద్ధి కోసం ఖర్చు చేశారు.
విద్యను అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్లడమే తమ ముందున్న లక్ష్యమని ప్రకటించారు.
ఈ సైనిక పాఠశాల పూర్తిగా ఉచితం. ఇది పూర్తిగా రెసిడెన్షియల్ గా ఉంటుంది.
ఇక్కడ నిపుణులైన అధ్యాపకులు, ప్రత్యేకించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన పదవీ విరమణ పొందిన నిపుణులు బోధిస్తారు. ఢిల్లీలో నివసించే పిల్లలు ఎవరైనా ఇక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు.
ఇందులో 9, 11 వ తరగతిలో ప్రవేశం ఉంటుంది. ఇక భగత్ సింగ్ సైనిక్ స్కూల్ (Bhagat Singh Sainik School)లో
నేషనల్ డిఫెన్స్ అకాడమీ – ఎన్డీఏ, నేవీ, ఎయిర్ ఫోర్స్ , తదితర సాయుధ దళాలలో చేరేందుకు విద్యార్థులకు శిక్షణ ఇస్తారు.
విద్యార్థులకు పూర్తిగా భోజనం, వసతి ఉచిత. అంతే కాదు బాల, బాలికలకు వేర్వేరుగా గదులు ఏర్పాటు చేస్తారు.
దీనిని ఢిల్లీలోని ఝురోదా కలాన్ లో ఏర్పాటు చేస్తారు. దీని క్యాంపస్ 14 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంటుంది.
ఇందులో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తారు. పాఠశాలలో విద్యార్థులకు సైనిక అధికారులు తర్ఫీదు ఇస్తారు.
ఇదిలా ఉండగా 200 సీట్లకు గాను ఇప్పటి వరకు 18 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ విషయాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) ప్రకటించారు. పైరవీలకు తావుండదు. ఈనెల 27, 28 తేదీలలో అప్టిట్యూడ్ టెస్టు చేపడతారు. రెండు తరగతులకు కలిపి 100 సీట్ల చొప్పున ఉంటాయి.
మొదటి పరీక్షలో క్వాలిఫై అయిన వారిని తుది దశలో ఇంటర్వూ చేస్తారు. ఈ స్కూల్ ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ కు అనుబంధంగా ఉంటుందని వెల్లడించారు. ఏది ఏమైనా (Delhi CM) ఢిల్లీ సీఎంను చూసి తెలంగాణ సీఎం నేర్చుకుంటే బాగుంటుంది.
Also Read : ‘స్వామి శివానంద’ స్మరామీ