Delhi Assembly Elections : అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసిన ఆప్ పార్టీ

దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం తీహాడ్ జైల్లో ఉన్నారు...

Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో నగారా మోగనుంది. అలాంటి వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. తన అభ్యర్థుల జాబితాలను వరుసగా విడుదల చేస్తోంది. అందులోభాగంగా సోమవారం మరో జాబితాను విడుదల చేసింది. 20 మంది అభ్యర్థుల పేరులతో రెండో జాబితాను ఆప్(AAP) విడుదల చేసింది. పట్పర్ గంజ్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఈ సారి తన అసెంబ్లీ నియోజకవర్గాన్ని మార్చుకోనున్నారు. రానున్న ఎన్నిక(Assembly Elections)ల్లో జంగ్ పురా అసెంబ్లీ స్థానం నుంచి మనీశ్ సిసోడియా ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలువనున్నారు. ఇక పట్పర్ గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ అభ్యర్థిగా అవథ్ ఓఝా పోటీ చేయనున్నారు. ఈ మేరకు రెండో జాబితాలో స్పష్టం చేసింది. నవంబర్ మాసంలో 11 మంది అభ్యర్థుల జాబితాను ఆప్ తొలి జాబితాను విడుదల చేసిన విషయం విధితమే. అయితే ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలున్నాయి. వాటిలో ఆప్ నేటి వరకు 39 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లు అయింది.

Delhi Assembly Elections AAP 2nd List

2013 ఎన్నిక(Assembly Elections)ల్లో జంగ్ పురా అసెంబ్లీ స్థానం నుంచి ఢిల్లీ అసెంబ్లీ మాజీ స్పీకర్ మణిందర్ సింగ్ ధీర్ విజయం సాధించారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. దీంతో 2015, 2020లో ఆప్ అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ ను బరిలో దింపింది. అయితే రానున్న ఎన్నికల్లో ఈ అసెంబ్లీ స్థానం నుంచి మనీశ్ సిసోడియాను బరిలో నిలపాలని ఆప్ నిర్ణయించింది. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది.

దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం తీహాడ్ జైల్లో ఉన్నారు. ఆయనకు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. ప్రజా తీర్పు అనంతరం మళ్లీ ప్రభుత్వంలో చేరతానంటూ మనీశ్ సిసోడియా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ కొద్ది రోజులకే.. ఇదే వ్యవహారంలో ఆప్ జాతీయ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను సైతం ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన సైతం బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే ప్రజా తీర్పు తర్వాతే.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతానంటూ సీఎం కేజ్రీవాల్..తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆప్ ఎమ్మెల్యే అతిషిని ఢిల్లీ సీఎంగా ఎంపిక చేసి.. బాధ్యతలు కట్టబెట్టారు.

ఇక డిసెంబర్ మొదట్లో అవథ్ ఓఝా ఆప్ లో జాయిన్ అయ్యిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోొ అధికారాన్ని మళ్లీ చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇంకోవైపు ఈ సారి ఎలాగైన ఢిల్లీలో పాగా వేయాలని బీజేపీ సైతం అదే చాణక్యంతో వ్యవహరిస్తోంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో అధికార పగ్గాలు చేపట్టాలని ఈ రెండు పార్టీల మధ్య ప్రధానంగా పోరు నడవనుంది. అయితే ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ వైపు హస్తిన ఓటరు మొగ్గు చూపుతాడంటే.. మాత్రం చెప్పడం కష్టమన్నది సుస్పష్టం.

Also Read:R Krishnaiah : రాజ్యసభ అభ్యర్థిగా ‘ఆర్ కృష్ణయ్య’ ఎంపిక చేసిన బీజేపీ

Leave A Reply

Your Email Id will not be published!