Delhi Assembly Elections : ఢిల్లీలో నిలిచిన ఎన్నికల ప్రచార రధాలు
దీంతో వివిధ రాజకీయ పార్టీల నేతలు..
Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం అంటే.. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5.00 గంటలకు ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. దీంతో వివిధ రాజకీయ పార్టీల నేతలు.. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోనేందుకు ఓటర్లను సమాయత్తం చేసేందుకు సిద్దమవుతోన్నారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉండనుంది.
Delhi Assembly Elections Campaign
అయితే వరుసగా మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని అందుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు ఢిల్లీ(Delhi)లో ఆప్ పాలనకు చరమ గీతం పాడాలని బీజేపీ భావిస్తోంది. అదీకాక ఈ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు ఆప్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు.. బీజేపీలో చేరారు. కానీ ఈ ఎన్నికల్లో వారికి టికెట్లు కేటాయించ లేదు. దీంతో వారంతా బీజేపీలో చేరారు.
ఇక ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. అలాగే ఇదే కూటమిలోని పక్షాలైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సమాజ వాదీ పార్టీలు నేతలు.. ఈ ఎన్నికల వేళ ఆప్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే బీజేపీకి మద్దతుగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల్లో ఒకటైన టీడీపీ ప్రచారం నిర్వహించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో తెలుగు వారు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు పలువురు ఎంపీలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు.
Also Read : TTD News : శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి..రథసప్తమి వేళ ఆ దర్శనాలకి ఆటంకం