DC vs SRH : ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్ లో దుమ్ము రేపింది రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్(DC vs SRH ). తనను అవమానించడమే కాకుండా పొమ్మనకుండా పొగ పెట్టి వెళ్లి పోయేలా చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ పై కసి తీర్చుకున్నాడు ఆసిస్ స్టార్ డేవిడ్ వార్నర్.
స్పీడ్ పేసర్ గా పేరొందిన ఉమ్రాన్ మాలిక్ ను సైతం వదిలి పెట్టలేదు ఢిల్లీ ఆటగాళ్లు. దాంతో 21 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 207 పరుగులు చేసింది. ఇక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్ వార్నర్ మామ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
మనోడు 58 బంతులు ఎదుర్కొని 92 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 12 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక మరో స్టార్ ప్లేయర్ రోవ్ మన్ పావెల్ 35 బంతులు ఎదుర్కొని 67 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 3 ఫోర్లు 6 భారీ సిక్సర్లు ఉన్నాయి. శివమెత్తినట్టు ఆడాడు పావెల్. అనంతరం 208 పరుగుల భారీ లక్ష్యం ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ (DC vs SRH )20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసి చాప చుట్టేసింది.
ఇక నికోలస్ పూరన్ ఒక్కడే దుమ్ము రేపాడు. 34 బంతులు మాత్రమే ఎదుర్కొని 62 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి.
Also Read : ఎవరీ మహిపాల్ క్రిషన్ లోమ్రోర్