Sunil Gavaskar : గత ఐపీఎల్ సీజన్ లో అనూహ్యంగా అవమానాలు ఎదుర్కొన్నాడు ఆసిస్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్. సన్ రైజర్స్ హైదరాబాద్ కు సుదీర్ఘ కాలం పాటు ఆడడమే కాదు ఆ జట్టుకు టైటిల్ కూడా అందించాడు కెప్టెన్ గా.
కానీ పూర్తిగా విఫలమయ్యాడు. చివరకు ఆటగాళ్లకు కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చాడు. కానీ అతడిని అత్యంత బాధాకరమైన రీతిలో పంపించేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. ఆ జట్టు గురించి, మేనేజ్ మెంట్ గురించి పల్లెత్తు మాట అనలేదు వార్నర్.
గత ఫిబ్రవరి 12, 13 తేదీలలో జరిగిన మెగా వేలం పాటలో ఢిల్లీ క్యాపిటల్స్ వార్నర్ ను తీసుకుంది. వారి అంచనాలకు తగ్గట్టే రాణించాడు. తాజాగా జరిగిన కేకేఆర్ మ్యాచ్ లో సైతం 42 రన్స్ తో ఆకట్టుకున్నాడు.
ఇప్పటి దాకా జరిగిన మ్యాచ్ ల లో 55 సగటుతో పరుగులు చేశాడు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కు కీలకంగా మారాడు. ఈ సీజన్ లో మరింత మెరుగ్గా రాణించాడు. ఐపీఎల్ ను అద్భుతంగా ఆస్వాదిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు వార్నర్ మామ.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు ఈ స్టార్ ప్లేయర్. ఒక్కోసారి ఫ్రాంచైజీలు మారడంతో పాటు డ్రెస్సింగ్ రూమ్ కూడా ఆటగాళ్ల ఆట తీరుపై ప్రభావం చూపుతుందన్నాడు.
ఏ మార్పు అయినా ముందు గదిలోనే ప్రారంభం అవుతుందన్నాడు. మాజీ కెప్టెన్ గవాస్కర్ వార్నర్(Sunil Gavaskar )సహజ సిద్దమైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడని కితాబు ఇచ్చాడు. సానుకూల వాతావరణం వల్లే ఏ జట్టు అయినా గెలిచే చాన్స్ ఉంటుందన్నాడు.
Also Read : ఆ ఇద్దరి సపోర్ట్ వల్లే ఆడా – తెవాటియా