Arvind Kejriwal Bail : బెయిల్ కోసం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు తప్పని తిప్పలు

కాగా, కీలకమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025 ప్రథమార్థంలో జరగాల్సి ఉన్నాయి...

Arvind Kejriwal : సీబీఐ నమోదు చేసిన ఎక్సైజ్ పాలసీ కేసు లో బెయిలు కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి సుప్రీంకోర్టు శుక్రవారం వాయిదా వేసింది. దీంతో బెయిల్ కోసం కేజ్రీవాల్ మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. సీబీఐ అరెస్టును సవాలు చేస్తూ ఒక పిటిషన్, బెయిలు కోరుతూ మరో పిటిషన్‌ను కేజ్రీవాల్(Arvind Kejriwal) అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేశారు. ఈ పిటిషన్లలో ఒక దానికి సీబీఐ తన స్పందన తెలియజేయగా, రెండో పిటిషన్‌కు స్పందన తెలియజేసేందుకు మరింత వ్యవధి కావాలని కోర్టును కోరింది. దీంతో రెండో పిటిషన్‌పై సీబీఐ సమాధానం సమర్పించేందుకు కోర్టు వారం రోజులు గడువు ఇచ్చింది.

Arvind Kejriwal Bail Update

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22లో అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గత మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. దీనికి ముందు 2023 ఫిబ్రవరిలో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అవకతవకల ఆరోపణలపై సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. కాగా, కీలకమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025 ప్రథమార్థంలో జరగాల్సి ఉన్నాయి. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాల్లో 62 అసెంబ్లీ స్థానాల్లో ‘ఆప్’ విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ కేవలం 8 సీట్లకే పరిమితం కాగా, కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవకుండానే చతికిలపడింది.

Also Read : CM Chandrababu Naidu : మాజీ ముఖ్యమంత్రి పై నిప్పులు చెరిగిన సీఎం చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!