Delhi CM Atishi : ఢిల్లీ సీఎం నివాసం నుంచి తనను గెంటేశారంటున్న సీఎం అతిషి
అవసరమైతే ఢిల్లీ ప్రజల ఇళ్లకు వెళ్లి అక్కడ ఉండటానికి కూడా తాను సిద్ధమేనని అన్నారు...
CM Atishi : సీఎం అధికార నివాసం నుంచి బీజేపీ తనను మరోసారి గెంటేసిందని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఢిల్లీ ప్రజల ఇళ్లకు వెళ్లి అక్కడ ఉండటానికి కూడా తాను సిద్ధమేనని అన్నారు.
Delhi CM Atishi Comment
”ఈరోజు అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నన్ను సీఎం నివాసం నుంచి సోమవారం రాత్రి గెంటేసింది. ఇలా జరగడం గత మూడు నెలల్లో ఇది రెండోసారి. ఇళ్లు లాక్కోవడం, మాపై బురదచల్లడం, కుటుంబ సభ్యులపై నిందలు వేయడం వంటి పనులతో మమ్మల్ని పనిచేయకుండా చూడాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. వాళ్లు మా ఇళ్లు లాక్కుని, మా పనులను అడ్డుకోవచ్చు కానీ ఢిల్లీ ప్రజల కోసం పనిచేయాలనే మా తపనను అడ్డుకోలేరు. అవసరమైతే ఢిల్లీవాసుల ఇళ్లకు వెళ్లి వాళ్లతోనే ఉండి ప్రజల కోసం పని చేస్తాను” అని అతిషి(CM Atishi) తెలిపారు.
మూడు నెలల క్రితం కూడా ఇలాగే చేశారని, తన వస్తువులన్నింటినీ రోడ్డుపైకి విసిరేశారని అతిషి ఆక్షేపణ తెలిపారు.బీజేపీ ఒకటి గుర్తుంచుకోవాలని, ఇవాళ మరోసారి సీఎం నివాసం నుంచి గెంటేసినా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకొంటామని చెప్పారు. ఢిల్లీలోని ప్రతి మహిళలకు ప్రతినెలా రూ.2,100 ఆర్థిక సాయం, పూజారులు, గ్రంథులకు రూ.18,000 గౌరవ వేతనం, వయోవృద్ధులకు సంజీవని యోజన కింద ఉచిత వైద్యం అందించేదుకు తాము వాగ్దానం చేశామని, దానికి కట్టుబడి ఉంటామని తెలిపారు.
Also Read : Perni Nani-AP HC : మాజీ మంత్రి పేర్ని నానికి కొంత ఉరటనిచ్చిన హైకోర్టు