Delhi CM Oath Ceremony : మరికొద్దిసేపట్లో ‘రేఖ గుప్త’ ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం

వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు బీజేపీ ప్రాధాన్యం ఇచ్చింది...

Delhi CM : దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి బీజేపీ అధిష్ఠానం బుధవారం తెరదించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా(Rekha Gupta) ఇవాళ (గురువారం) మధ్యాహ్నం 12:35 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతోపాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేలు పర్వేశ్ వర్మ, మంజిన్డెర్ సింగ్, రవీంద్ర రాజ్, కపిల్ మిశ్రా, ఆశిష్ సూద్, పంకజ్ కుమార్ సింగ్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. అయితే మంత్రి పదవి కేటాయింపుల్లో వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు బీజేపీ(BJP) ప్రాధాన్యం ఇచ్చింది.

Delhi CM Oath Ceremony today

న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై గెలిచిన పర్వేశ్ వర్మ జాట్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. 2014 , 2019లో పర్వేశ్ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2024 లోక్ సభ సీటు ఆశించినప్పటికీ నిరాశే ఎదురైంది. కాగా, తాజాగా జరిగిన ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. రాజోరి గార్డెన్ నియోజకవర్గం ఎమ్మెల్యే మంజిన్డెర్ సింగ్ సిక్కు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. బావన నార్త్ ఎమ్మెల్యే రవీంద్ర రాజ్ దళిత కులానికి చెందిన వ్యక్తి. అలాగే కార్వాల్ నగర్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రాది పూర్వాంచల్ సామాజికవర్గం కాగా.. జనక్ పూరీ ఎమ్మెల్యే ఆశిశ్ సూద్‌ది పంజాబీ సిక్కు సామాజికవర్గం.

వికాస్ నగర్ సౌత్ వెస్ట్ ఢిల్లీ ఎమ్మెల్యే పంకజ్ కుమార్ సింగ్ పూర్వాంచల్ సామాజికవర్గానికి చెందినవారు. వీరంతా ఈరోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కీలక నేతలు హాజరుకానున్నారు. కాగా, 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ సింహాసనంపై బీజేపీ కూర్చొనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మరోవైపు ప్రమాణ స్వీకారోత్సవానికి రామ్ లీలా మైదానాన్ని అధికారులు ముస్తాబు చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ సైతం పాల్గొననున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Also Read : 1st March-NO FASTag : మార్చి 1 నుంచి ఫాస్టాగ్ సేవలు బంద్

Leave A Reply

Your Email Id will not be published!