Delhi Court Sisodia : సిసోడియాకు 5 రోజుల కస్టడీ
లిక్కర్ కేసులో మనీష్ కోర్టు
Delhi Court Sisodia Custody : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు 5 రోజుల కస్టడీ(Delhi Court Sisodia Custody) విధించింది కోర్టు. విచారణలో మనీష్ సిసోడియా మద్యం కంపెనీల మార్జిన్ ను 5 నుంచి 12 శాతానికి పెంచుతూ డ్రాఫ్ట్ నోట్ ను ఎక్సైజ్ కమిషనర్ కు ఇచ్చారని, దాని నుంచి న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని తొలగించారని సీబీఐ ఆరోపించింది. మద్యం కుంభకోణంకు సంబంధించి ఆదివారం విచారణకు పిలిచింది సీబీఐ. ఈ మేరకు నిన్న ఉదయం 11 గంటలకు హాజరయ్యారు సిసోడియా.
ఎనిమిది గంటలకు పైగా విచారణ కొనసాగింది. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(Manish Sisodia)పై ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే ఏ ఒక్క దానికి సరైన సమాధానం ఇవ్వలేదని ఆరోపించింది సీబీఐ. సోమవారం మనీష్ సిసోడియాను కోర్టులో హాజరు పర్చింది. తమకు 10 రోజులకు పైగా కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ కోర్టుకు విన్నవించింది. జడ్జి మొత్తం కేసును విన్న తర్వాత 5 రోజుల కస్టడీకి అనుమతిచ్చారు.
ఈ సందర్భంగా సీబీఐ కీలక వ్యాఖ్యలు చేసింది. మనీష్ సిసోడియా తమ ప్రశ్నలకు తప్పించుకునే సమాధానాలు ఇస్తున్నారని , మద్యం పాలసీలో మొదటి డ్రాఫ్ట్ లో భాగం కాని కనీసం ఆరు వివాదాస్పద రూల్స్ ను వివరించడంలో విఫలమయ్యారటూ ఏజెన్సీ ఢిల్లీ కోర్టుకు తెలిపింది. రూ. 100 కోట్ల కిక్ బ్యాక్ లకు బదులుగా మద్యం లాబీ కోరిక మేరకే మార్పులు చేశారంటూ సంచలన ఆరోపణలు చేసింది.
ఇదిలా ఉండగా మే 2021లో మద్యం పాలసీపై లెఫ్టినెంట్ గవర్నర్ కూడా సంతకం చేశారని వివరించారు. సీబీఐ సిసోడియాతో పాటు గతంలో పని చేసిన ఎల్జీని కూడా విచారించాలని న్యాయవాది కోరారు.
Also Read : బీఎస్ యెడ్యూరప్పకు మోదీ గిఫ్ట్