Delhi Excise Policy Case : ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుడు ‘విజయ్ నాయర్’ కు బెయిల్ మంజూరు

విజయ్ నాయర్ 2014 నుంచి ఆమ్ ఆద్మీ పార్టీతో అసోసియేషన్ కలిగి ఉన్నారు...

Delhi Excise Policy : ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన ఈడీ కేసులో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ మాజీ ఆఫీస్ బేరర్ విజయ్ నాయర్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించింది. ఈ కేసులో 23 నెలలుగా తీహార్ జైలులో ఉన్న నాయర్‌కు అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. మనీష్ సిసోడియా కేసును ప్రస్తావిస్తూ, అండర్ ట్రయిల్‌గా ఆయనను ఎక్కువ కాలం జైలులో ఉంచరాదని, ఇది సహజ న్యాయానికి విరుద్ధమని పేర్కొంది. దీనికి ముందు సీబీఐ కేసులోనూ సుప్రీంకోర్టు(Supreme Court) ఆయనకు బెయిల్ మంజరు చేసింది. ఈడీ కేసులో తాజాగా బెయిల్ మంజూరు కావడంతో ఆయన జెలు నుంచి బెయిలుపై విడుదల కావడానికి మార్గం సుగగమైంది.

Delhi Excise Policy Case Updates

విజయ్ నాయర్ 2014 నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)తో అసోసియేషన్ కలిగి ఉన్నారు. పార్టీ తరఫున ఫండ్ రైజింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆప్ మీడియా, కమ్యూనికేషన్ వ్యూహకర్తగా కూడా ఉన్నారు. 2021-22 ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో చోటుచేసుకున్న అవకతవకల్లో నాయర్‌కు ప్రమేయం ఉందని సీబీఐ గతంలో ఆరోపించింది. కాగా, ఈడీ కేసులో జస్టిస్ హృషికేష్ రాయ్, ఎస్‌వీన్ భట్టితో కూడిన ధర్మాసనం సోమవారంనాడు తీర్పు చెబుతూ, మనీలాండిరింగ్ కేసులో గరిష్ట శిక్ష ఏడేళ్లు ఉంటుందని, అయితే ఆయన 22 నెలలుగా జైలులోనే ఉన్నారని పేర్కొంది. నాయర్ బెయిల్ అభ్యర్థనపై సమాధానం చెప్పాల్సిందిగా ఆగస్టు 12న ఈడీని సుప్రీం ఆదేశించింది. 2022 నవంబర్ 12న నాయర్‌ను ఈడీ అరెస్టు చేసింది. నాయర్ బెయిల్ అభ్యర్థనను గత ఏడది జూన్ 3న ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చంది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Also Read : Minister Savitha : తోట్లవల్లూరు మండలం పునరావాస కేంద్రంలో పర్యటించిన మంత్రి

Leave A Reply

Your Email Id will not be published!