Sanatan Board : ‘సనాతన ధర్మ బోర్డు’ ఏర్పాటు తీర్మానాన్ని తోసిపుచ్చిన హైకోర్టు
మీరు ప్రభుత్వం దగ్గరకు వెళ్లండి, మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం...
Sanatan Board : ‘సనాతన్ ధర్మ రక్షా బోర్డు’ ఏర్పాటును కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు తోసిపుచ్చింది. అలాంటి బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా తాము అధికారులను ఆదేశించ లేమని, ఇది విధాన పరమైన నిర్ణయమైనందును కోర్టుకు రావడానికి బదులు ప్రభుత్వం దగ్గరకు వెళ్లాలని చీఫ్ జస్టిస్ మన్మోహన్ సారథ్యంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
Sanatan Board..
”మీరు ప్రభుత్వం దగ్గరకు వెళ్లండి, మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం. వాళ్లు (ఎంపీలు) ఈ అంశాన్ని పార్లమెంటులో చర్చిస్తారు. ఈ విషయంలో మేము చేయగలిగేది ఏమీ లేదు” అని జస్టిస్ తుషార్ రావ్ గేదెల అన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ, ఇతర మతాల్లో వారికి సంబంధించిన బోర్డులు ఉన్నాయని, ఇతర మతాలను అనుసరించే వారి నుంచి రక్షణ కోసం బోర్డు అవసరం ఉందని ఉన్నారు. తమ రిప్రజెంటేషన్‌పై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని కోర్టుకు విన్నవించారు. అయితే, పిటిషనర్ కోరినట్టు తాము ఆదేశాలివ్వలేని కోర్టు పేర్కొంది. ప్రభుత్వాన్ని ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛ ఇస్తూ రిట్ పిటిషన్‌ను క్లోజ్ చేస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
Also Read : TG High Court : మాగనూర్ ఫుడ్ పాయిజన్ పై అధికారుల పై భగ్గుమన్న హైకోర్టు