Jacqueline Fernandez : జాక్వెలిన్ ను ఎందుకు అరెస్ట్ చేయొద్దు 

తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఢిల్లీ హైకోర్టు 

Jacqueline Fernandez : మ‌నీ లాండ‌రింగ్ కేసును ఎదుర్కొంటున్న ప్ర‌ముఖ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez)  పై కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఒక ర‌కంగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. జాక్వెలిన్ ను ఎందుకు అరెస్ట్ చేయ‌కూడ‌దంటూ ప్రశ్నించింది. ఎందుకింత జాప్యం జ‌రుగుతోందంటూ నిల‌దీసింది.

ఇదిలా ఉండ‌గా ఆమె దేశం విడిచి పారి పోయేందుకు ప్ర‌య‌త్నించింద‌ని, విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని, ఆమెపై తీవ్ర ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ కోర్టులో జాక్వెలిన్ గురించి తెలియ చేసింది. ఇదిలా ఉండ‌గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సుకేష్ చంద్ర‌శేఖ‌ర్ ను నుండి ఖ‌రీదైన బ‌హుమ‌తులు అందుకున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

కాగా ఫెర్నాండెజ్ బెయిల్ ను గురువారం వ్య‌తిరేకించ‌డంతో ఈడీ ఢిల్లీ హైకోర్టులో క‌ఠిన‌మైన ప్ర‌శ్న‌ల‌ను ఎదుర్కొంది. ఆమెను ఎందుకు అరెస్ట్ చేయ‌లేద‌ని నిప్పులు చెరిగింది ధ‌ర్మాస‌నం. ఎల్ఓసీ జారీ చేసిన‌ప్ప‌టి నుండి మీరు జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez)  ను ఎందుకు అరెస్ట్ చేయ‌లేదు అని మండిప‌డింది.

ఆమె న‌టి అయినందుకు వ‌దిలి పెట్టారా లేక ఆమెకు ఏమైనా మిన‌హాయింపు ఉందా అని నిల‌దీసింది. ఇదే కేసుకు సంబంధించి నిందితులు జైల్లో ఉన్న‌ప్పుడు ఆమెను ఎందుకు అరెస్ట్ చేయ‌లేక  పోయారంటూ ఈడీని ఏకి పారేసింది.

అయితే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బెయిల్ అభ్య‌ర్థన‌పై కోర్టు శుక్ర‌వారం త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. అంత‌కు ముందు జాక్వెలిన్ కు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరైంది.

Also Read : పార్కుల్లో మ‌హిళ‌ల‌కు నో ఎంట్రీ

Leave A Reply

Your Email Id will not be published!