Delhi New CM : ఢిల్లీలో బీజేఎల్పీ సమావేశం..నేటితో సీఎం ఎవరనేదానిపై స్పష్టత
కాగా ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం గురువారం జరగనుంది...
Delhi New CM : నూతన ముఖ్యమంత్రి ఎవరనే విషయానికి బుధవారం తెరపడనుంది. బుధవారం మధ్యాహ్నం బీజేఎల్పీ సమావేశం కానుంది. దీంతో ఢిల్లీ నూతన సీఎంపై స్పష్టత వస్తుంది. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో బీజేఎల్పీ నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు ఢిల్లీ బీజేపీ(BJP) ఎంపీలు కూడా పాల్గొంటారు. బీజేఎల్పీ నేత ఎన్నిక తర్వాత లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను నేతలు కలవనున్నారు. ఇప్పటికే సిఎం ప్రమాణస్వీకారం కోర్డినేటర్లుగా వినోద్ తావ్డే, తరుణ్ చుగ్‌లను బీజేపీ(BJP) అధిష్ఠానం నియమించింది.
Delhi New CM Updates
కాగా ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం గురువారం జరగనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో పర్వేష్ వర్మ (న్యూ ఢిల్లీ), రేఖా గుప్తా (షాలిమార్ బాగ్), విజేందర్ గుప్తా (రోహిణి), సతీష్ ఉపాధ్యాయ్ (మాల్వియా నగర్), ఆశిష్ సూద్ (జనక్‌పురి), పవన్ శర్మ (ఉత్తమ్ నగర్), అజయ్ మహావార్ (ఘోండా) తదితరులు ఉన్నారు. రాం లీలా మైదానంలో ప్రమాణస్వీకారానికి ఢిల్లీ ప్రభుత్వం అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా ఢిల్లీ సిఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీఏ కీలక నేతలు హాజరవుతున్నారు.
కాగా ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేసిన విషయం తెలిసిందే. దాదాపు 27 ఏళ్ల తర్వాత కమలం పార్టీ అధికారంలోకి వచ్చింది. మెుత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు పలువురు కీలక నేతలు ఓటమి పాలయ్యారు. ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం రామ్ లీలా మైదాన్‌లో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వివిధ రాష్ట్రాల్లోని ఎన్డీఏ పక్షాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఇక్కడ సుమారు 30 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఉన్న రామ్ లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కావల్సిన ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు.అతిథులు, పార్టీ మద్దతుదారులు బస చేయడానికి టెంట్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.ప్రమాణ స్వీకారం జరిగే ప్రధాన వేదికను సిద్ధం చేస్తున్నారు.
Also Read : Ex CM YS Jagan : నేడు గుంటూరు మిర్చి యార్డుకు రానున్న మాజీ సీఎం జగన్