Delhi Stampede : ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట..18 కి చేరిన తొక్కిసలాట
కొంత గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం...
Delhi Stampede : రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరిగి 18కి చేరింది. పలువురు గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసహాయం అందించాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా డాక్టర్లకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం రాత్రి ఢిల్లీ(Delhi) రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 15 మంది మృతి చెందారు. 10 మంది మహిళలు, 3 చిన్నారులు కూడా మృతుల్లో ఉన్నారు. 30 మందికి పైగా గాయపడినట్లు ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కొన్ని గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Delhi Stampede Updates
మహాకుంభమేళాకు వెళ్ళే భక్తుల కోసం రైల్వే శాఖ న్యూఢిల్లీ(Delhi) రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. దీంతో భక్తులు భారీగా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పుడు 14, 15 ప్లాట్‌ఫాంపై తొక్కిసలాట జరిగింది.
ఘటన జరిగిన సమయంలో ప్రయాణికులు ఒక్కసారిగా రైళ్లలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన తరువాత రైల్వే శాఖ మొదటగా ఎలాంటి తొక్కిసలాట లేదని, వదంతులు నమ్మొద్దని ప్రకటించింది. అయితే, పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించామని పేర్కొంది. వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడ చేరుకొని గాయపడినవారిని వివిధ ఆసుపత్రులకు తరలించాయి.
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, పరిస్థితులు అదుపులో ఉన్నాయని, ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఘటన సమయంలో భద్రతా సిబ్బంది లేరని కొన్ని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. రెండు రైళ్లు ఆలస్యంగా రావడం, ప్రయాణికులు 15–20 నిమిషాల్లోనే పెద్దఎత్తున ప్లాట్‌ఫాంపైకి చేరుకోవడం వల్ల తొక్కిసలాట జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు.
ప్రముఖులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తదితరులు విచారం వ్యక్తం చేశారు. ఇతర పక్షంలో, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మహాకుంభమేళా పొడిగించమని యూపీ ప్రభుత్వాన్ని కోరారు.
Also Read : Hamas Releases : 500 రోజుల తర్వాత 3 ఇజ్రాయెలీలను రిలీజ్ చేసిన హమాస్