Delimitation: డీలిమిటేషన్ పై ఈ నెల 22న చెన్నైలో సమావేశం !
డీలిమిటేషన్ పై ఈ నెల 22న చెన్నైలో సమావేశం !
Delimitation : లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్రానికి వ్యతిరేకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ నెల 22న ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలకు లేఖలు రాసిన సీఎం స్టాలిన్(CM MK Stalin)… తమ ప్రభుత్వానికి చెందిన మంత్రుల బృందంతో పలువురి నాయకులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తమిళనాడు మంత్రుల బృందం నేరుగా కలిసి ఆహ్వానించనుంది.
Delimitation..
జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణకు కృషి చేసిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం తగ్గనున్నట్టు భావిస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక పార్టీల ప్రతినిధులతో చెన్నైలో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు కేరళ, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించడానికి రాష్ట్ర మంత్రులతో కూడిన బృందం బయలుదేరింది. ఒడిశాలో బిజు జనతా దళ్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను తమిళనాడు పరిశ్రమలశాఖ మంత్రి టీఆర్‌బీ రాజా, ఎంపీ దయానిధి మారన్‌తో కూడిన బృందం మంగళవారం కలిసింది. సమావేశానికి ఆహ్వానిస్తూ, తమ ప్రయత్నాలకు మద్దతు కోరుతూ ముఖ్యమంత్రి తరఫున లేఖను అందించింది. త్వరలో మిగిలిన రాష్ట్రాల మంత్రులు, పార్టీ అధినేతల వద్దకు స్వయంగా వెళ్ళి ఈ మంత్రుల బృందం సమావేశానికి ఆహ్వానించనుంది.
Also Read : MLC Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన నాయకుల ఫిర్యాదులు