Deputy CM Bhatti : రీజినల్ రింగ్ రోడ్ అంశంపై కేంద్ర మంత్రిని కలిసిన తెలంగాణ సర్కార్

రీజనల్ రింగ్ రోడ్డుపై కూలంకషంగా చర్చించినట్లు వివరించారు...

Deputy CM Bhatti : రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ మంత్రులు ఈరోజు (బుధవారం) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భేటీకి సంబంధించిన అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు వివరణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో రోడ్ నెట్‌వర్క్‌కు అవసరమైన అంశాల గురించి ప్రెసెంటేషన్ ఇచ్చామని చెప్పారు.

Deputy CM Bhatti Meet

రీజనల్ రింగ్ రోడ్డుపై కూలంకషంగా చర్చించినట్లు వివరించారు. దీనికి వారు అంగీకరించారు. విజయవాడ-హైదరాబాద్ రహదారికి టెండర్లు పిలవడానికి అంగీకారం కుదిరిందన్నారు. హైదరాబాద్-కల్వకుర్తి రోడ్డు, ఇతర రహదారులపై చర్చలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని సహాయ సదుపాయాలను కల్పిస్తుందని నితిన్ గడ్కరీకి తెలియజేసినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో వారం రోజుల్లోగా సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం కానున్నట్టు తెలిపారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ అభివృద్ధికి కృషి చేసిన నితిన్‌ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : PM Narendra Modi: జులైలో ప్రధాని మోదీ రష్యా పర్యటన !

Leave A Reply

Your Email Id will not be published!