Deputy CM Bhatti : టీఎస్‌ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి..

టీఎస్‌ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు

Deputy CM Bhatti : రాష్ట్రంలో TSRTC ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చింది. మంగళవారం ఎలక్ట్రిక్ బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. “ఇవాళ 25 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగులు (టీఎస్‌ఆర్‌టీసీ) జీతాలు అందక ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ ఆస్తులు కోల్పోతామనే ఆందోళనలు నెలకొన్నాయన్నారు. ఆర్టీసి ఉద్యోగులకు భావ ప్రకటనా స్వేచ్ఛ లేదన్నారు. రాష్ట్రంలో సింగరేణి, ఆర్టీసీలో వేలాది మంది ఉద్యోగులు ఉన్నారని డిప్యూటీ సీఎం చెప్పారు.

Deputy CM Bhatti Comment

టీఎస్‌ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని అన్నారు. మహాలక్ష్మిగా కొలువుదీరిన మహిళలు గౌరవంగా బస్సుల్లో ప్రయాణిస్తారన్నారు. మహిళలకు టిక్కెట్ల కోసం డబ్బు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ అభివృద్ధికి కూలిలా పని చేస్తున్నారన్నారు. మూడు నెలల్లో ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు అమలు చేశామని” డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎమ్మెల్యే ధానం నాజేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి పాల్గొన్నారు.

Also Read : Haryana CM Resign : సడన్ గా సీఎం పదవికి రాజీనామా చేసిన లాల్ ఖట్టర్

Leave A Reply

Your Email Id will not be published!