Deputy CM Bhatti : తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా రెడీ చేస్తాం

ప్రస్తుత రెసిడెన్షియల్ స్కూలల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని చెప్పారు...

Deputy CM Bhatti : ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పాఠశాలల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. సచివాలయంలో రెసిడెన్షియల్ స్కూల్స్ డిజైన్లను ఇవాళ(ఆదవారం) విడుదల చేశారు. సచివాలయంలో భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) మాట్లాడుతూ… ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ విద్యార్థులను సిద్ధం చేయబోతున్నామని తెలిపారు. ఇంటర్నేషనల్ స్టాండప్స్‌తో 20-25 ఎకరాల్లో రెసిడెన్షియల్ స్కిల్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఒక్కో పాఠశాలకు రూ. 25 నుంచి 26 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పారు. ఇప్పటి వరకు చాలా రెసిడెన్షియల్ స్కూళ్లకు పక్కా భవనాలు లేక అద్దె భవనాలు ఉన్నాయని చెప్పారు. ఒకటోతరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే దగ్గర బోధన చేస్తున్నారని అన్నారు. గత మూడు నెలలుగా రెసిడెన్షియల్ స్కూళ్లపై కసరత్తు చేశామన్నారు.

Deputy CM Bhatti Vikramarka Comment

ప్రస్తుత రెసిడెన్షియల్ స్కూలల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. 662 స్కూళ్లకు పక్కా భవనాలు లేవని అన్ని అద్దె భవనాలేనని చెప్పారు. ఈ ఏడాది 5 వేల కోట్ల రూపాయలు రెసిడెన్షియల్ స్కూళ్లకు ఖర్చు చేస్తామని అన్నారు. కుల‌మత, లింగ భేదం లేకుండా రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్లు ఉంటాయని స్పష్టం చేశారు. పేద పిల్లలు తాము ఏదో మిస్సవుతున్నామని అనుకోకూడదని అన్నారు. అవసరమైతే ప్రతీ రెసిడెన్షియల్ పాఠశాలలో స్మాల్ థియేటర్ కడుతామని అన్నారు. ఈనెల 11న సాధ్యమైనన్ని పాఠశాలలకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ఇప్పటికే 24 నియోజకవర్గాల్లో స్థలాలు ఎంపిక పూర్తయిందని అన్నారు. వీలైనంత త్వరగా ప్రతీ నియోజకవర్గంలో ఒక రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. 7 నెలల్లో రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని అన్నారు. రెసిడెన్షియల్ పాఠశాల నియామకం సొసైటీ ద్వారా జరుగుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Also Read : Minister Kandula : వైసీపీ ప్రభుత్వం పర్యాటక శాఖ ను నాశనం చేసింది

Leave A Reply

Your Email Id will not be published!