Deputy CM Bhatti : ఎందరు ఎన్ని కుట్రలు చేసిన కులగణన చేసి చూపిస్తాం
రాష్ట్రసాధనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు....
Deputy CM Bhatti : కుల గణనపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) కీలక వ్యాఖ్యలు చేశారు. కుల గణన అడ్డుకోవాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు దోపిడీ దారులు కులగణనపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎందరు కుట్ర చేసినా కుల గణనను విజయవంతం చేస్తామని అన్నారు. ఇవాళ(గురువారం) గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ప్రజలతో మమేకం అవుతూ ప్రజల సమస్యలు తెలుసుంటుందని.. ముఖాముఖీ కార్యక్రమానికి రావడం జరిగిందని అన్నారు. ప్రజావాణితో పాటు.. పార్టీ భావజాలన్ని నమ్మి.. ఓటేసిన ప్రజల అభిప్రాయాలను,ఇబ్బందులను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం తీసుకున్నామని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు గడిల మధ్య ఉండి పాలన చేసిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం ప్రజా పాలన చేస్తుందని ఉద్ఘాటించారు. విద్య, వైద్యం మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా..డైట్ చార్జీలు 40శాతం పెంచి అందిస్తున్నామని చెప్పారు..చాలా పథకాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.
Deputy CM Bhatti Vikramarka Comment
‘‘రాష్ట్రసాధనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు..ప్రభుత్వం రాగానే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి.. 50వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. పదేళ్లలో గ్రూప్- 1 పరీక్షలు సరిగ్గా నిర్వహించాలేక గాలి వదిలేశారు. బీఆర్ఎస్ నేతల కుటిల ప్రయత్నాలను తట్టుకొని ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం. మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ.. ఆ వడ్డీనీ సైతం ప్రభుత్వం కట్టనుంది. మహిళ సంఘాలతో వెయ్యి మెగా ఓల్ట్ విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకున్నాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది.60 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో ముందుకు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాం. ఇది పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. కుల గణన చారిత్రాత్మక విజయం. దేశానికి తెలంగాణ మోడల్‌గా కుల గణన నడుస్తుంది. కుల గణనను అడ్డుకోవాలని దోపిడీ దారులు ప్రయత్నం చేస్తున్నారు. వనరులు ప్రజలకు సమానంగా పంచాలని కోరుకునే వారు కుల గణనకు మద్దతు తెలపాలి’’ అని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Also Read : KTR : వరుస ట్వీట్లతో అధికార పార్టీకి గుబులు పుట్టిస్తున్న కేటీఆర్