CM Chandrababu : నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం

ఇక నామినేటెడ్ పోస్టుల విషయంలో త్వరలో నాలుగో జాబితా విడుదలపై కసరత్తు చేస్తున్నారు...

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అమరావతిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. కాకినాడ పోర్ట్‌లో రేషన్ బియ్యం కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వీరిద్దరు ప్రధానంగా చర్చించారు. దీనిపై త్వరలో ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.ఈ అంశంపై మంగళవారం జరిగే కేబినెట్‌లో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తుంది. అలాగే రాజధాని అమరావతిలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించారు. డిసెంబర్ 15వ తేదీ నుంచి అమరావతి పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా వారు నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతోపాటు ఇటీవల ఢిల్లీ వేదికగా చోటు చేసుకున్న కీలక పరిణామాలపై వీరు చర్చించారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన మృతి పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) విచారం వ్యక్తం చేశారు.

CM Chandrababu Meet…

ఇక నామినేటెడ్ పోస్టుల విషయంలో త్వరలో నాలుగో జాబితా విడుదలపై కసరత్తు చేస్తున్నారు. అందులోభాగంగా పలువురి పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. మూడు జాబితాల విషయంలో ఎటువంటి వివాదాలకు తావు లేకపోవడంతో నాలుగు జాబితా సైతం కష్టపడి పని చేసిన వారికి పదవులు కేటాయించాలని వీరిద్దరు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. మరో 15 రోజుల్లో నాలుగో జాబితా విడుదల చేసే అవకాశముంది. కాకినాడ పోర్ట్ నుంచి ప్రజా పంపిణి బియ్యం స్మగ్లింగ్ అవుతున్న నౌకను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా సీజ్ చేయించారు. ఈ నేపథ్యంలో ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఈ అంశంపై వైసీపీ నేతలు పేర్ని్ నాని, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బియ్యం అక్రమ రవాణా విషయంపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) సీరియస్ అయిన విషయం విధితమే. తాజాగా వీరి భేటీలో ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.

ఇకఈ ఏడాది మే, జూన్ మాసాల్లో ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాయి. ఈ ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటులో భాగంగా ఈ మూడు పార్టీలకు చెందిన ఆశావహులు.. ఎన్నికల బరిలోకి దిగలేదు. ఈ నేపథ్యంలో వారికి నామినేటేడ్ పదవులు కేటాయిస్తామని.. ముందే పార్టీల అధినేతలు హామీ ఇచ్చారు. దీంతో ఈ ఎన్నికల్లో కూటిమ ఘన విజయం సాధించింది. దీంతో నామినేటేడ్ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా ఇప్పటికే మూడు జాబితాలను విడుదల చేసింది. నాలుగో జాబితా విడుదలకు రంగం సిద్ధం చేస్తుంది.

Also Read : YS Jagan Assets Case : వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో అనుకోని మరో కీలక ట్విస్ట్

Leave A Reply

Your Email Id will not be published!