Deputy CM Pawan : గూగుల్ ఒప్పందాలపై సీఎంకు అభినందనలు తెలిపిన పవన్
అనంతరం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పవన్ మాట్లాడుతూ....
Deputy CM Pawan : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందలు తెలియజేశారు. ‘‘రాష్ట్రానికి గూగుల్‌ను తీసుకువచ్చేందుకు మీరు చేసిన ప్రయత్నం అభినందనీయం. ప్రతిసారి మీరు మీ సామర్ధ్యాన్ని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు’’ అంటూ సీఎంను పవన్(Deputy CM Pawan) పొగడ్తలతో ముంచెత్తారు. బుధవారం ఉదయం సీఎం చంద్రబాబుతో గూగుల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై ఏపీ ప్రభుత్వం సంతకాలు చేసింది. కలెక్టర్ కాన్ఫరెన్సన్‌కు ముందు చంద్రబాబు నివాసంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాలపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి.. సీఎంకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
Deputy CM Pawan Appreciates..
అనంతరం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పవన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురిచేశారన్నారు. రెవన్యూ సిబ్బందితో సినిమా టికెట్లు అమ్మించారని మండిపడ్డారు. దీనిపై నాడు ఐఏఎస్‌లు ఎందుకు మాట్లాడలేదు అనిపించేదన్నా్రు. ప్రజల నిస్సాహయత నాడు రోడ్లపైకి వచ్చిందన్నారు. రాజకీయ పాలన ఫెయిల్ అయితే అడ్మినిష్ట్రేషన్ దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలన్నారు. అయితే అలా చేయకపోవడం వల్ల రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు అప్పలు వచ్చాయని తెలిపారు. ఈ గుణపాఠం ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలని లేకపోతే ప్రజలే తిరగబడతారన్నారు. సిరియా, శ్రీలంకలలో ఏం జరిగిందో చూశామన్నారు. సైబరాబాద్‌లో రాళ్లు, రప్పలు మధ్య ఓ నగరాన్ని సీఎం చూడగలిగారన్నారు. ‘‘అధికారుల సపోర్టు ఈ ప్రభుత్వానికి కావాలి… దీనికోసం మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నా’’ అని పవన్ అన్నారు.
కాకినాడలోమంత్రి నాదేండ్ల మనోహర్ మూడు చెక్ పోస్టులు పెట్టాక కూడా స్మగ్లింగ్ జరుగుతుంటే ఎందుకు కలెక్టర్‌లు, ఎస్పీలు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కాకినాడ పోర్టులో ఎలా కసబ్ ఎంటర్ అయ్యాడో అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. నాడు జరిగిన సంఘటన వల్ల 300 మంది ప్రాణాలు పోయారని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Also Read : CM MK Stalin : అదానీతో భేటీ, పెట్టుబడులపై స్పందించిన సీఎం ఎంకే స్టాలిన్