Deputy CM Pawan : ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న జనసేనాని

అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ అవుతారు...

Deputy CM Pawan : ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో పవన్ బాధ్యతలు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉదయం 9.30 గంటలకు పవన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ అవుతారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో పలు అంశాలపై పవన్ చర్చించనున్నారు. పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన రోజే వరుస సమావేశాలతో బిజీబిజీగా గడుపుతారు.

Deputy CM Pawan Kalyan Take..

పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలకు పవన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు సారథ్యం కార్యక్రమం జరగనుంది. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉదయం 11.30 గంటలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశం…మధ్యాహ్నం 12.30 గంటలకు పంచాయతీ కార్యదర్శుల సంఘంతో పవన్ భేటీ కానున్నారు.

Also Read : MP Raghunandan Rao : నేను ఎవరికీ బయపడనంటూ మాస్ రేంజ్ వార్నింగ్ ఇచ్చిన ఎంపీ

Leave A Reply

Your Email Id will not be published!